Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్‌లోని కొత్త లుక్‌: ఓ హ్యాడ్సమ్ హీరోలా.. నిధి అగర్వాల్‌తో..?

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (19:38 IST)
sonu sood
ప్రముఖ నృత్య దర్శకురాలు, దర్శకురాలు ఫరాఖాన్‌కు సోనూసూద్‌లోని కొత్త లుక్‌ను తెర మీద ఆవిష్కరించాలనే కోరిక కలిగినట్టుగా ఉంది. తొంభైలలో అల్తాఫ్ రాజా పాడగా సూపర్ డూపర్ హిట్ అయిన ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ గీతాన్ని రీక్రియేట్ చేసి ‘సాత్ క్యా నిభావోగే’ పేరుతో లేటెస్ట్గా సోనూసూద్, నిధి అగర్వాల్ పై ఫరాఖాన్ చిత్రీకరించింది. ఈ వీడియోలో ఓ హ్యాడ్సమ్ హీరోలా సోనూసూద్ కనిపించాడు.
 
ఈ వీడియోలో ఫరాఖాన్ ఓ చక్కని ప్రేమకథను తెలిపే ప్రయత్నం చేసింది. కొంతమంది గుండాలను పట్టుకోవడానికి పోలీస్ అధికారి సోనూసూద్ పబ్ లోకి ఎంటర్ అయ్యి, వారిని పట్టుకుంటాడు. అదే పబ్ లో అతని మాజీ ప్రేయసి నిధి అగర్వాల్ డాన్సర్ గా ఉండటం చూసి ఆశ్యర్యపోతాడు. అతన్ని పోలీస్ ఆఫీస్ గా చూసి ఆమె కూడా షాక్ కు గురవుతుంది. వీరిద్దరి మధ్య కొన్నేళ్ళ క్రితం పల్లెటూరిలో జరిగిన ప్రేమాయణాన్ని ఫరాఖాన్ ఫ్లాష్ బ్యాక్‌లో చూపించారు. అనివార్య పరిస్థితుల్లో సోనూకు నిధి దూరమై పోతుంది. 
 
అయితే తిరిగి వాళ్ళిద్దరూ ఇలా కలుసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. దాదాపు నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ మ్యూజిక్ వీడియోను పంజాబ్ లోని పచ్చని పొలాల నడుమ తీశారు. ఏడేళ్ళ క్రితం ఫరాఖాన్ దర్శకత్వం వహించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ మూవీలో సోనూసూద్ కీలక పాత్ర పోషించాడు. బహుశా అప్పటి నుండీ సోనూను వేరే విధంగా చూపించాలనే కోరిక ఫరాఖాన్‌లో ఉండిపోయినట్లుంది. 
 
ఈ గీతాన్ని అల్తాఫ్ రాజాతో కలిసి టోనీ కక్కర్ పాడాడు. సోనూసూద్, నిధి అగర్వల్ జంట అభిమానులకు కనువిందు చేసేలా ఉంది. దాంతో ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన ఆదరణ లభిస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments