Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చ‌ర‌ణ్‌కి షారూఖ్ ఖాన్ కండీషన్‌

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (22:00 IST)
Ram Charan, Shah Rukh Khan
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రం జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కి సిద్ధ‌మైంది. దీపికా పదుకొనె, జాన్ అబ్ర‌హం కూడా ఈ చిత్రంలో న‌టించారు. ప్ర‌స్తుతం ప‌ఠాన్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలతో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. 
 
ఈ క్ర‌మంలో షారూఖ్ ఖాన్ త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మంలో #AskSRK సెష‌న‌ల్‌లో పాల్గొన్నారు. ఇందులో త‌న ఫ్యాన్స్‌, నెటిజ‌న్స్‌ను ఆయ‌న ప్ర‌శ్న‌లు వేయ‌మ‌న్నారు. అందులో ఆయ‌న కొన్ని ఫ‌న్నీ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. అలాంటి ప్ర‌శ్న‌ల్లో ఓ ప్ర‌శ్న దానికి షారూఖ్ ఖాన్ ఇచ్చిన స‌మాధానం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 
 
ఓ అభిమాని షారూఖ్‌తో ‘‘హాయ్ సర్, మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో మూవీ థియేటర్స్‌కి వ‌స్తారా?’ అని ప్ర‌శ్నించాడు. దానికి షారూఖ్ ఖాన్ స‌మాధానం చెబుతూ ‘తప్పకుండా.. అయితే నన్ను రామ్ చరణ్ తీసుకెళితేనే వస్తాను’ అన్నారు. షారూఖ్ ఇచ్చిన సమాధానం.. అందులో మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ గురించి ఆయ‌న ప్ర‌స్తావించ‌టం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. 
 
ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ షారూఖ్ ఖాన్‌, రామ్ చ‌ర‌ణ్ ఇలా వారి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేయ‌టం ఇదేమీ కొత్త కాదు. జ‌న‌వ‌రి 10న ప‌ఠాన్ తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మం ద్వారా విడుద‌ల చేసి యూనిట్‌కు అభినంద‌నలు తెలిపారు. అప్పుడు షారూక్ స్పందించిన సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న‌ల్ అయ్యింది. అలాగే ఇప్పుడు కూడా ఆయ‌న రామ్ చ‌ర‌ణ్ గురించి ప్ర‌స్తావించ‌టం ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments