Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్‌ చరణ్‌ గురించి ఎన్‌.టి.ఆర్‌. ఏమన్నాడో తెలుసా!

Advertiesment
charan-ntr
, శనివారం, 21 జనవరి 2023 (11:50 IST)
charan-ntr
ఇప్పటి ట్రెండ్‌ హీరోలు ఒకరికొకరు తమ సినిమాలను కష్టసుఖాలను షేర్‌ చేసుకుంటూ వుంటారు. అందులో తాముంటామని రామ్‌ చరణ్‌, ఎన్‌.టి.ఆర్‌.కూడా వెల్లడించారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. అందులో ఫ్రెండ్‌ షిప్‌ గురించి కథంతా వుంటుంది. నాటు నాటు సాంగ్‌ కూడా ఫ్రెండ్‌గా అతని లవ్‌ను సక్సెస్‌ చేయడానికి చరణ్‌ డాన్స్‌ నుంచి చివరిలో డ్రాప్‌ అవుతాడు. 
 
ఈ సందర్భంగా యు.ఎస్‌.ఎ.లో ఓ రేడియో ఛానల్‌ వీరిద్దరిని ఇంటర్వ్యూ చేసింది. ఫ్రెండ్‌ షిప్‌ గురించి, అసలు మీ ఇద్దరి రిలేషన్‌ గురించి చెప్పమంటే వెంటనే తారక్‌ ఇలా చెప్పాడు. నాకు ఏదైనా హెల్ప్‌ కావాలంటే మొదటి కాల్‌ చేసేది చరణ్‌కే. అందరికీ చరణ్‌ లాంటి స్నేహితుడు వుండాలి.
 
ఎర్రీథింగ్‌.. ఏదైనా డౌట్‌ వస్తే, నాకున్న వేళ్ళతో లెక్కించదగ్గవారిలో మొట్టమొదటగా ఫోన్‌ చేసేది చరణ్‌కే. ఎవ్రీ థింగ్‌ షుడ్‌ బి, కెన్‌ బీ ఫ్రెండ్‌.. అంటూ హాలీవుడ్‌ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రామ్‌చరణ్‌ వెంటనే ఆప్యాయంగా తారక్‌ను దగ్గరగా తీసుకున్నారు. చరణ్‌ కూడా వెంటనే తారక్‌ లాంటి బెస్ట్‌ ఫ్రెండ్‌ దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటి జనరేషన్‌కు వీరు ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం. తాజాగా చరణ్‌ ఆర్‌.సి.15 సినిమా చేస్తుండగా, తారక్‌, కొరటాల శివతో చేయనున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ లో మాస్ సాంగ్ విడుదల