Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు` షాడో రిలీజైంది

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (13:06 IST)
Evaru melo koteeswarlu shadow
`మా` టీవీలో `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు` అనే ప్రోగ్రామ్ తెలిసిందే. నాగార్జున దానికి హోస్ట్‌గా వున్నాడు. ఇప్పుడు ఇటువంటి రియాల్టీ షోను జెమినీ టీవీ భుజాన వేసుకుంది. కానీ పేరుగా కొద్దిగా అటూఇటూ మార్చింది. అదే `ఎవరు మీలో కోటీశ్వరులు`. దీనిలో ఎన్‌.టి.ఆర్‌. హోస్ట్‌గా వ‌స్తున్న‌ట్లు ప‌లు సంద‌ర్భాల్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాగా, ఆదివారంనాడు ఏకంగా ఆయ‌న కుర్చీలో కూర్చున్న షాడో రూపంలో లోగో విడుద‌ల చేసింది. సినిమాలు చేస్తూ ఒక్క‌సారిగా బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు స‌రికొత్త రియాలిటీ షోతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాడు.
 
 ఇదిలా వుండ‌గా, ఒక్కోటి ఈ షోకు సంబంధించిన విష‌యాలు త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి ప‌లు ప్రోమోస్ షూట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. త్రివిక్ర‌మ్ వీటిని డైరెక్ట్ చేశారు. ఇప్ప‌టికే దీనిపై హోంవ‌ర్క్ చేశారు. అయితే గ‌తంలో చేసిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుల‌కు భిన్న‌మైన రీతిలో వినూత్నంగా జ‌ర‌ప‌నున్న‌ట్లు తెలిసింది. ఈ ఎపిసోడ్‌కు సూమారు కోటికి పైగా పారితోషికాన్ని తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. ఈ రియాల్టీ షో 2020లోనే ఆరంభం కావాల్సింది. కానీ కోవిడ్ వ‌ల్ల ఈ ఏడాదికి షురూ కానుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments