టాలీవుడ్ అగ్రహీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయనకు కొత్త కార్లంటే మహామోజు. యేడాదికి ఒకకారును మారచేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన గ్యారేజ్‌లోకి మరో కారు వచ్చి చేరనుంది. ఆ కొత్తకారును కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు.
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ నిజ జీవితంలో వాడే వస్తువులు, వాటి బ్రాండ్స్, ఖరీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇపుడు ఆ కోవలోనే ఆయన కొత్త కారు కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా అత్యంత ఖరీదైన లంబోర్గిని కారును ఎన్టీయార్ కొనుగోలు చేశాడట.
ఎడారి ప్రాంతం, సాధారణ రోడ్లు, కొండ ప్రాంతం.. ఇలా ఎక్కడైనా పరుగులు తీసే ఈ సూపర్ స్పోర్ట్స్ కారు ధర సుమారు 5 కోట్ల రూపాయలట. విలాసవంతమైన ఈ కారు ఇటలీ నుంచి భారత్‌కు దిగుమతి అవుతోందట. ఈ కారును ఎన్టీయార్ తనకు నచ్చిన విధంగా తయారు చేయించుకున్నాడట. త్వరలోనే ఈ కారు హైదరాబాద్ చేరుకోనుందట.