Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ను పరిశీలించిన సిసోడియా

వరుణ్
గురువారం, 25 జులై 2024 (16:01 IST)
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇటీవల సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలా లేదని ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమల రావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పది పోలీసు బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మదనపల్లెకు వెళ్లి ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా సందర్శించి, అక్కడ పలు రికార్డులను పరిశీలించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మదనపల్లె ఘటనపై కుట్ర కోణాన్ని వెలికితీసే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ ఘటనలో సిబ్బంది ప్రమేయం ఉందా? లేక బయటి వ్యక్తుల పనా? అనేది దర్యాప్తులో తేలుతుందని అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనలో రెవెన్యూ, పోలీసుల విచారణ సమాంతరంగా సాగుతోందని పేర్కొన్నారు.
 
రెవెన్యూ శాఖకు సంబంధించి 2,400 ఫైళ్లు కాలిపోయాయని సిసోడియా వెల్లడించారు. దాదాపు 700 ఫైళ్లను రికవరీ చేయగలిగామని, కాలిపోయిన ఫైళ్లను రీక్రియేట్ చేస్తున్నామని వివరించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో జులై 10వ తేదీ నుంచి సీసీ టీవీ కెమెరాలు పనిచేయడంలేదని గుర్తించామని సిసోడియా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments