Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా వస్తాయి.. అప్పుడే నన్ను ఊరేగించండి: పవన్ (video)

Pawan kalyan

సెల్వి

, సోమవారం, 1 జులై 2024 (18:50 IST)
Pawan kalyan
అన్నదానాన్ని మించిన దానం లేదని చెప్పటమే కాకుండా నిస్వార్థంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న 'అపర అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారు. 
 
అన్నదానమే కాకుండా మరెన్నో శుభాకార్యాలకు విరాళాలు ఇచ్చిన దాత కూడా ఈ మహా ఇల్లాలు. ఈమె గురించి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్మరించుకున్నారు. 
 
డొక్కా సీతమ్మ కీర్తి ప్రతిష్ఠలు మరింత ఇనుమడించేలా.. ఆమె కీర్తి భావితరాలకు తెలిసేలా అన్నా క్యాంటీన్లతో పాటు కొంతమేరా డొక్కా సీతమ్మ గారి కాంటీన్లు కూడా ఉంటాయంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 
 
పిఠాపురం పర్యటనలో భాగంగా గొల్లప్రోలులో జరిగిన ఆత్మీయ సమావేశంలో పవన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రత పరిరక్షణ విషయంలో కఠినంగా వున్నామని చెప్పారు. పొట్టి శ్రీరాములు బలిదానం వల్లే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. 
 
డొక్కా సీతమ్మ సేవల్ని మనం నిత్యం స్మరించుకోవాలి. ఆమె పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి. సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తానని వెల్లడించారు. 
 
పిఠాపురం అభివృద్ధికి ఏం చేయగలనా అని నిత్యం ఆలోచిస్తున్నానని.. పిఠాపురాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని.. పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన తర్వాతే తనను ఊరేగించాలని చెప్పారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనని అంటూ భావోద్వేగంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాకింగ్ వీడియో : లోనావాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం (Video)