Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మురారి' చిత్ర పూజారి పాత్రధారి ఇకలేరు

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (13:06 IST)
సినీ, రంగస్థల నటుడు శ్రీనివాస దీక్షితులు ఇకలేరు. ఆయన వయసు 62 యేళ్లు. హైదరాబాద్‌లోని నాచారం స్టూడియోలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాతగా రూపొందిస్తున్న 'సిరిసిరిమువ్వ' టీవీ సీరియల్‌లోని ఓ సన్నివేశంలో నటిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. 
 
ఆయన భార్య లక్ష్మీచిత్రలేఖ మూడేళ్ల క్రితం కన్నుమూశారు. కుమార్తె, కుమారుడు ఉన్నారు. అక్కినేని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా యాక్టింగ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ప్రస్తుతం సేవలందిస్తున్నారు.
 
రేపల్లెలో విద్యాభ్యాసం చేసి అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డారు. థియేటర్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది పలు నాటకాలకు దర్శకత్వం వహించారు. టీవీ రంగంలో అడుగిడి పలు సీరియల్స్‌లో నటించడమేకాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకత్వం వహించిన 'ఆగమనం' సీరియల్‌ నంది అవార్డు గెలుచుకుంది. 
 
'మురారి' సినిమాలో పూజారి పాత్రలో నటించిన ఆయన 62 సినిమాలలో తన నటనతో మెప్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments