Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి అంతపని చేస్తారని అనుకోలేదు : శేఖర్ కమ్ముల

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (20:56 IST)
మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములు ప్రసంశల వర్షం కురిపించారు. చిరంజీవి అంత పని చేస్తారనీ ఏ ఒక్కరూ ఊహించలేదన్నారు. పైగా, ఆ పని చేసినందుకు ఆయన్ను ఎవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు. 
 
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని కూలీలు, పేద కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి మరికొంతమందితో కలిసి తన బ్లడ్ బ్యాంకుకు అనుబంధగా కరోనా క్రైసిస్ ఛారిటీ మన కోసం అనే పేరుతో ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. 
 
దీనికి తనవంతుగా కోటి రూపాయలను చిరంజీవి ఇచ్చారు. ఆ తర్వాత అనేక మంది సినీ సెలెబ్రిటీలు, ప్రముఖులు తమవంతు సాయం చేశారు. ఈ వచ్చిన సొమ్ముతో మూడు నెలలకు సరిపడ వంట సరుకులు, చేతి ఖర్చులకు కొంత నగదును ఇచ్చారు. 
 
దీనిపై ఫిదా డైరక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు. సినీ ఇండస్ట్రీలోని పేద కళాకారులను ఆదుకునేందుకు చిరంజీవి అంత పని చేస్తారని ఏ ఒక్కరూ ఊహించలేరన్నారు. ఆయన చేసిన పనితో ఉపాధి కోల్పోయిన కళాకారులు పస్తులు లేకుండా ఉంటున్నారంటూ ప్రశంసలు కురిపించారు. 
 
అలాగే, కరోనాకు ముందు, కరోనా తర్వాత సొసైటీకి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిపై కూడా శేఖర్ కమ్ములు పొగడ్తల వర్షం కురిపించారు. వీరి సేవలను ప్రతి ఒక్క పౌరుడు గుర్తించాలని కోరారు. ముఖ్యంగా, పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడలని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, జీహెచ్ఎంసీ ద్వారా శానిటేషన్ వర్కర్లకు సాయం చేసేందుకు తాను, తన బృందం సర్వదా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments