Webdunia - Bharat's app for daily news and videos

Install App

వళ్లంతా చూపించడం నా వల్ల కాదు : సాయిపల్లవి

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (18:21 IST)
వెండితెరపై వళ్ళంతా చూపిస్తూ అంగాంగ ప్రదర్శన చేయడం తన వల్ల కాదని హీరోయిన్ సాయి పల్లవి చెబుతోంది. ఈ ఒక్క కారణంగానే తాను ఎన్నో సినిమాలను వదులుకున్నట్టు చెప్పింది. అయినప్పటికీ.. తనకు బాధ లేదని స్పష్టం చేసింది.
 
పుట్టింది, పెరిగింది తమిళనాడులో అయినప్పటికీ, సాయిపల్లవి అచ్చతెలుగు అమ్మాయిలా ఉంటుంది. పైగా మాతృభాషతో పాటు.. తెలుగు, కన్నడ భాషల్లో రాణిస్తోంది. ముఖ్యంగా, ఈ అమ్మడుకు తమిళంలో కంటే తెలుగు, మలయాళ సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. 
 
అయితే, వెండితెరపై అందాల ఆరబోతపై ఆమె స్పందిస్తూ, 'మొదటి నుంచి కూడా తెరపై ఒక సాధారణమైన కాలేజ్ అమ్మాయిలా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడతాను. కురచ దుస్తులు వేసుకోవడం, శ్రుతిమించిన వయ్యారాలు ఒలకబోయడం నాకు ఇష్టం ఉండదు. 
 
'ఫిదా' సినిమాలో ఒక సీన్‌లో కురచ డ్రెస్ వేసుకున్నాను. ఆ సన్నివేశానికి అది అవసరం. అలాగే మరో సినిమాలో కనిపించాలంటే మాత్రం ఒప్పుకోను. వత్తిడి చేస్తే ఆ సినిమాను వదులుకోవడమే జరుగుతుంది. అలా వదులుకున్న సినిమాలు చాలానే వున్నాయి' అని వివరించింది. 
 
కాగా, సాయిపల్లవి నటనకి అవకాశం వుండే కథలను, సహజత్వానికి దగ్గరగా వుండే పాత్రలను మాత్రమే సాయిపల్లవి ఎంచుకుంటూ వెళుతోంది. గ్లామరస్‌గా కనిపించే విషయంలో మొదటి నుంచి కూడా తను అనుకున్న పరిధిని దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments