Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్లో రీమేక్ కానున్న టాలీవుడ్ హిట్ మూవీస్..!

Advertiesment
ismart shankar
, సోమవారం, 27 ఏప్రియల్ 2020 (22:21 IST)
టాలీవుడ్ మూవీస్‌కి బాలీవుడ్లో ఈమధ్య క్రేజ్ పెరగడం తెలిసిందే. బాహుబలి సినిమా చరిత్ర సృష్టించడంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ టాలీవుడ్ వైపు చూడడం మరింత పెరిగిందని చెప్పచ్చు. ఇటీవల టాలీవుడ్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 
 
కబీర్ సింగ్ టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. దీంతో బాలీవుడ్లో మరిన్ని తెలుగు సినిమాలు రీమేక్ కానున్నాయని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఎనర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇస్మార్ట్ శంకర్. 
 
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ నటించనున్నాడని సమాచారం. అక్టోబర్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
అలాగే నేచురల్ స్టార్ నాని నిర్మించిన సినిమా హిట్. ఈ సినిమా కూడా బాలీవుడ్లో రీమేక్ కానుందని తెలిసింది. ఈ మూవీని కబీర్ సింగ్ ప్రొడ్యూసర్స్ నిర్మించనున్నారని టాక్. మరి.. టాలీవుడ్లో సక్సస్ సాధించిన ఇస్మార్ట్ శంకర్, హిట్ మూవీస్ బాలీవుడ్లో కూడా సక్సస్ సాధిస్తాయో లేదో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్షయ్ కుమార్ పెద్ద మనసు : ముంబై పోలీసు ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు