Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్లాస్మా థెరపీ‌తో సాధ్యం కాదు.. వికటిస్తే ప్రాణాలకే ముప్పు : లవ్ అగర్వాల్

Advertiesment
Plasma Thearpy
, బుధవారం, 29 ఏప్రియల్ 2020 (19:50 IST)
కరోనా వైరస్‌కు ప్లాస్మా థెరపీ సరైన చికిత్స కాదని కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పైగా, ఈ ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగదశలోనే ఉందని ఆరోగ్యం శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ బారిన పడి ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు చేసే ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగదశలోనే ఉందని, 'కరోనా' నివారణకు ఈ థెరపీ ఉపయోగపడుతుందన్న ఆధారాలు లేవని చెప్పుకొచ్చారు. 
 
పైగా, ఈ ప్లాస్మా చికిత్సపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని తెలిపారు. దీనికి ఆమోదం లభించే వరకు ప్లాస్మా థెరపీ పద్ధతి వద్దన్నారు. ట్రయల్ పద్ధతిలో లేదా పరిశోధనల నిమిత్తమే ప్లాస్మా థెరపీని వినియోగించాలని, కరోనా పేషెంట్‌కు ప్లాస్మా చికిత్స‌ను సరైన పద్ధతిలో అందించకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుందన్నారు. 
 
అంతేకాకుండా, వైద్య పరీక్షల్లో తక్కువ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలిన వారిని లేదా ప్రీ సింప్టమ్స్ కనిపిస్తున్న వారిని తొలుత హోం ఐసోలేషన్‌లో ఉండాలని కోరుతున్నారు. ఇలాంటి వారికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మరిన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
 
హోం ఐసోలేషన్ ఎవరికి అవసరం? 
వైద్య పరీక్షల్లో తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయిన వ్యక్తులు లేదా వైద్యుడు పరిశీలనలో కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానించి వ్యక్తులు ఎవరికి అవసరం. వీరంతా హోమ్ ఐసొలేషన్‌లో ఉండాలి. 
 
వీరి కుటుంబ సభ్యులు కూడా ఐసొలేషన్‌లో ఉండాలి. వీరి మంచిచెడ్డలు చూసేందుకు అన్ని వేళలా ఒక సహాయకుడు అందుబాటులో ఉండాలి. హోమ్ ఐసొలేషన్ సమయంలో హాస్పిటల్‌కు, సహాయకుడికి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి.
 
హోం ఐసోలేషన్‌లో ఉన్నపుడు ఏం చేయాలి?
చికిత్స ఇస్తున్న వైద్యుడి సలహా మేరకు సహాయకుడితో పాటు క్లోజ్ కాంటాక్టులో ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రొఫైలాక్సిస్ వాడాలి. మొబైల్‌లో ఆరోగ్యసేతు యాప్‌ డౌన్ లోడ్ చేసుకోవాలి. అన్ని సమయాల్లో ఈ యాప్ యాక్టివ్‌గా ఉండాలి.
 
ప్రతి పేషెంట్ తన ఆరోగ్యాన్ని చెక్ చేసేందుకు, తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా సర్వైలెన్స్ అధికారికి అందించేందుకు అంగీకరించాలి. సెల్ఫ్ ఐసొలేషన్‌కు సంబంధించిన ఫామ్‌ను పూర్తి చేయాలి. హోమ్ క్వారంటైన్ గైడ్ లైన్స్‌ను పాటించాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్: భారత్‌లో టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో లాభాల వెనుక నిజం ఏంటి?