Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పంతా సావిత్రిదే.. జెమినీ గణేశన్‌‌తో పెళ్లి తప్పుడు నిర్ణయం.. ఎంజీఆర్‌కి ఆమె అంటే ఇష్టం?

అలనాటి నటి సావిత్రి.. జెమినీ గణేశన్‌ను పెళ్లి చేసుకుని తప్పు చేసిందని.. ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం.. మద్యాన్ని వ్యసనంగా మార్చుకోవడం వంటి.. అన్నీ తప్పులు సావిత్రివేనని జెమినీ గణేశన్‌ సన్నిహి

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (10:57 IST)
అలనాటి నటి సావిత్రి.. జెమినీ గణేశన్‌ను పెళ్లి చేసుకుని తప్పు చేసిందని.. ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం.. మద్యాన్ని వ్యసనంగా మార్చుకోవడం వంటి.. అన్నీ తప్పులు సావిత్రివేనని జెమినీ గణేశన్‌ సన్నిహితుడు, సీనియర్ యాక్టర్ రాజేశ్‌ అన్నారు.


నాగ్ ‌అశ్విన్‌‌ దర్శకత్వం వహించిన మహానటి సినిమా అందరి మన్ననలు పొందుతున్న నేపథ్యంలో సావిత్రి బయోపిక్‌పై జెమిని గణేశన్‌ పెద్ద కుమార్తె కమల స్పందిస్తూ తన తండ్రిని తప్పుగా చూపించారని ఆరోపించారు. దీనిపై సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి స్పందిస్తూ తన సోదరి అలా అనడంలో తప్పులేదని అది కేవలం అభిప్రాయభేదం మాత్రమేనని సమర్థించారు. 
 
ఈ నేపథ్యంలో జెమిని గణేశన్‌ను సావిత్రి పెళ్లి చేసుకోవడం సరిదిద్దుకోలేని తప్పని సీనియర్ నటుడు, గణేశన్ సన్నిహితుడు రాజేశ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జెమిని గణేశన్‌కు పెళ్లైందని తెలిసి సావిత్రి ఆయన్ను ఇష్టపడ్డారు. వివాహం గురించి తెలిసినప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని రాజేశ్ అన్నారు. 
 
జెమినీ గణేశ‌న్‌తో సావిత్రి వివాహం తప్పుడు నిర్ణయం. జెమినికి జీవితంలో ఉన్న నియమాలు వేరని రాజేష్ అన్నారు. ఇక సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమిని గణేశనే అని సినిమాలో చూపించారు. ఎవరైనా పేరున్న వారు డ్రింక్స్ ఇస్తే తీసుకుంటాను. అలాగే జెమిని సావిత్రికి ఒకసారి తాగమని చెప్పారు. కానీ, ఆమె దానికి అలవాటుపడిపోయారు. తాగుడు అలవాటు చేసుకోవడం సావిత్రి తప్పేనని రాజేశ్ చెప్పుకొచ్చారు.
 
అలాగే ఎంజీఆర్‌కు సావిత్రి అంటే ఇష్టమని ఆమెతో ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆయన వారిని బెదిరించేవారని తనకు తెలిసింది. దాంతో ఎంజీఆర్‌పై అందరిలో చెడు అభిప్రాయం కలిగింది. కానీ, ఇదంతా తాను సావిత్రి కోసం చేస్తున్నట్లు ఎవ్వరితోనూ ఎంజీఆర్ చెప్పలేదట. మరో విషయమేంటంటే.. సావిత్రికి ఎంజీఆర్‌తో కలిసి నటించడం ఇష్టం లేదని తెలిసిందన్నారు రాజేష్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments