Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మహానటి' సావిత్రి కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పు అదేనట...

అలనాటి నటి సావిత్రి. తెలుగు చిత్ర పరిశ్రమంలో 'మహానటి'గా పేరుప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. కానీ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్ల ఎదుర్కొంది. ముఖ్యంగా, తమిళ సీనియర్ నటుడు జెమినీ గణేశ్‌న్‌ను పెళ్లి చేసుక

'మహానటి' సావిత్రి కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పు అదేనట...
, గురువారం, 24 మే 2018 (18:28 IST)
అలనాటి నటి సావిత్రి. తెలుగు చిత్ర పరిశ్రమంలో 'మహానటి'గా పేరుప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. కానీ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్ల ఎదుర్కొంది. ముఖ్యంగా, తమిళ సీనియర్ నటుడు జెమినీ గణేశ్‌న్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వైవాహిక, వ్యక్తిగత జీవితం ఎన్నో కష్టాలు అనుభవించింది.
 
ఇదిలావుంటే, ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం ఈనెల 9వ తేదీన విడుదలై మంచి ఆదరణ పొందడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సావిత్రిని గురించి కొంతమంది సీనియర్ నటీనటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలా జెమినీ గణేశన్‌కు అత్యంత సన్నిహితుడైన నటుడు రాజేశ్ స్పందించారు. 
 
'జెమినీ గణేశన్‌కి అంతకుముందే పెళ్లి అయిన విషయం సావిత్రికి తెలుసు. అలాంటివాడితో ప్రేమలో పడకూడదు అనే విషయం సావిత్రికి తెలియకుండా ఎలా ఉంటుంది? జెమినీ గణేశన్ లైఫ్‌స్టైల్ .. ఆయన ప్రవర్తన ప్రత్యేకంగానే ఉండేవి. అవి తెలిసి కూడా సావిత్రి ఆయనకి దగ్గరయ్యారు. 
 
ఇక సావిత్రికి జెమినీ గణేశన్ మద్యాన్ని అలవాటు చేసి ఉండొచ్చు .. కానీ ఆమె దానిని వ్యసనంగా మార్చుకున్నారు. తన మనస్తత్వానికి ఎంతమాత్రం సరిపడని వ్యక్తిని వివాహం చేసుకోవడమే సావిత్రి తన జీవితంలో చేసిన సరిదిద్దుకోలేని తప్పు' అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
అలాగే, విశ్వనటుడు కమల్ హాసన్ కూడా స్పందించారు. సావిత్రి గారు ప్యాలెస్‌లో జీవితాన్ని అనుభవించడాన్ని చూశాను... ఓ సాధారణ ఇంట్లో కూడా గడపటాన్ని కళ్లారా చూశానని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్... ఏంటి ఈ బూతులు? శ్రీరెడ్డి లేటెస్ట్ ఎఫ్‌బి పోస్ట్