Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్... ఏంటి ఈ బూతులు? శ్రీరెడ్డి లేటెస్ట్ ఎఫ్‌బి పోస్ట్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వర్సెస్ శ్రీరెడ్డి పరస్పర కామెంట్ల దాడి మనం చూస్తూనే వున్నాం. పవన్ కళ్యాణ్ పట్ల శ్రీరెడ్డి చేస్తున్న పోస్టులపై పవన్ ఫ్యాన్స్ స్పందిస్తున్న తీరును చూస్తూనే వున్నాం. ఈ నేపధ్యంలో శ్రీ

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్... ఏంటి ఈ బూతులు? శ్రీరెడ్డి లేటెస్ట్ ఎఫ్‌బి పోస్ట్
, గురువారం, 24 మే 2018 (17:53 IST)
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వర్సెస్ శ్రీరెడ్డి పరస్పర కామెంట్ల దాడి మనం చూస్తూనే వున్నాం. పవన్ కళ్యాణ్ పట్ల శ్రీరెడ్డి చేస్తున్న పోస్టులపై పవన్ ఫ్యాన్స్ స్పందిస్తున్న తీరును చూస్తూనే వున్నాం. ఈ నేపధ్యంలో శ్రీరెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సుకు సుదీర్ఘ పోస్టు ఒకటి చేశారు. అది యధాతథంగా... "పవణ్ కల్యాణ్ ఫ్యాన్స్, ఆపండి మీ comments. 

పవణ్ కోసం చచ్చిపోతాము అని కామెంటు పెడుతున్నారు. ఇది మిమ్మల్ని 9 నెలలు మోసి కని పెంచిన మీ అమ్మ నాన్న చూస్తే ఏమైపోతారు. అతని కోసమే చావండి అని మీ అమ్మ నాన్న మీకు ఏ లోటు రాకుండా వాళ్ళు తినకుండా నిద్రపోకుండా కంటికి రెప్పలా చూసుకుని పెంచింది. సిగ్గులేదా ఎవరికోసమో చావడానికి ఇందుకేనా మిమ్మల్ని కన్నది వాళ్లు. ఇప్పుడు వాళ్ళు పెంచకపోతే asalu కనకపోతే ఇలా మాట్లాడేవారేనా? ఈ మాటతో వాళ్ళని ఎంత బాధపెడుతున్నారో, ఎంత గుండె కోతకు గురిచేస్తున్నారో, అసలెవరీ కోసం బ్రతకాలో అలోచించండి. 
 
నీకు ఇంట్లో తినడానికి కూడా లేనపుడు నువ్ చచ్చిపోతానన్న పవణ్ వచ్చి నీకు అన్నం పెట్టాడా లేకపొతే నీ అమ్మ నాన్న పెట్టారా? ఎవరో ఒక్క నెగటివ్ పోస్టు పెట్టినా తట్టుకొని మీరు సమాజానికి ఏం సేవ చేస్తారు. మీ హీరో చెప్పాడా ఎవరు నెగటివ్ పోస్టు పెట్టినా వాళ్ళని పిచ్చిపిచ్చి మాటలతో కామెంట్ చెయ్యమని. ఇదేన మీరు సమాజానికి చేసే సేవ. మీకు చాతనైతే సినీ పరిశ్రమలో ఏ ఆడపిల్ల ఇకముందు బలి అవ్వకుండా చట్టాలు vachelaagaa పోరారండి. ఎందుకంటె రేపు మన ఇంటిలో నుండి మన ఆడపిల్లనే ఆ పరిశ్రమలోకి వెళ్లొచ్చు.
 
మోసపోయి రోడ్డెక్కి సపోర్టు చేస్తారని గుడ్డిగా ఎంతో నమ్మిన మీ హీరో చాలా తేలికగా మాట్లాడేసరికి మోసపోయిన బాధలో ఆవేశంలో ఒక మాట అంది కానీ మీరందరు ఏం చేస్తున్నారు ఆలోచించే కెపాసిటీ ఉండి పూర్తి స్తాయిలో ఆరోగ్యంగా ఉండి కావాలనే నానా బూతులు తిడుతూ చచ్చిపోయింది అని రెచ్చిపోయారు. ఒకరికి సహాయం చేయకపోయినా పర్లేదు కాని ఒకరి బాధకి మీరు ఆజ్యం పోస్తూ విచక్షణ రహితంగా కామెంట్లు పెడుతున్నారు. ఇది మీ హీరోనే చెప్పారా?
 
ప్రమోషన్స్‌కి, మీరు పబ్లిసిటీకి మీడియా కావాలి అప్పుడు వారి చేసిన తప్పులు గుర్తుకు రావు కానీ నెగటివ్‌ని చూపిస్తే మాత్రం మీడియా తప్పుడిది అంటున్నారు. మీకు మీడియా వల్ల నష్టం జరిగింది, తప్పుడిది అంటున్నారు కదా మీ పబ్లిసిటికి మీడీయాని పిలవకండి అంతేకాని ఇలాంటి కామెంట్స్ చేస్తూ మీ హీరో విలువ మీరు దిగజారుస్తున్నారు.
 
ఈ కామెంట్‌తో చాలామందికి కోపం రావచ్చు అది నేను పట్టించుకోను. నేను సమాజానికి చెప్పాలనుకుంది దైర్యంగా చెపుతాను. కానీ సమాధానం చెప్పడం చేతకాక పర్సనల్‌గా వారి ఫేసుబుక్‌లో స్క్రీన్ షాట్ తీసి పోస్టు పెట్టడం నాకు రాదు( vani shree vidya). వీలైతే మంచి చేయండి వీలుకాకపోతే మరొకరి మనోభావాలు కించపరిచేలా మాట్లాడి వ్యక్తిత్వం పోగొట్టుకోకండి.
 
గమనిక : నేను ఏ పార్టీకి, మీడియాకి, ఎవరికి సపోర్టు చేయను. సమాజానికి, నీతికి, న్యాయానికి మాత్రమే సపోర్టు చేస్తాను." అంటూ పోస్ట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విలన్ ఆఫ్ మై లైఫ్ : శ్రీరెడ్డి (ఫోటోలు)