"మహానటి"లో మోహన్ బాబు.. ఎస్వీఆర్ పాత్రలో...

అలనాటి నటీమణి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా 'మహానటి' చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాటి మేటి మహానటుడు ఎస్వీ రంగారావు పాత్రలో విలక్షణ నటుడు మోహన్ బాబు కనిపించనున్నారు.

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (13:21 IST)
అలనాటి నటీమణి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా 'మహానటి' చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాటి మేటి మహానటుడు ఎస్వీ రంగారావు పాత్రలో విలక్షణ నటుడు మోహన్ బాబు కనిపించనున్నారు. 
 
నిజానికి ఎస్వీ రంగారావు పేరు తలుచుకోగానే గంభీరమైన రూపం, అనర్గళమైన సంభాషణలు గుర్తుకొస్తాయి. ఎన్ని తరాలు గడిచినా అలాంటి నటుడు మళ్లీరాకపోవచ్చని అంటారు. ఎస్వీ రంగారావు తెరపై కనిపిస్తే హీరోలు సైతం వెలవెలపోవాల్సిందే. అంతటి మహానుభావుడి పేరు ఇపుడు మరోమారు చర్చనీయాంశంగా మారింది. 
 
మహానటి సినిమాలో మోహ‌న్ బాబుని ఎస్వీ రంగారావుగా మనముందుకు తీసుకురాబోతున్నారట. అయితే ఇన్నాళ్ళు దీనిపై ఎలాంటి క్లారిటీ రాక‌పోగా, తాజాగా మంచు ల‌క్ష్మీ చేసిన రీట్వీట్ మోహ‌న్ బాబు మ‌హాన‌టిలో న‌టించ‌నున్నాడ‌నే విష‌యం చెప్ప‌క‌నే చెబుతుంది. 
 
సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ క‌నిపించ‌నుండ‌గా, దుల్కర్ సల్మాన్, సమంత, ప్రకాష్ రాజ్, షాలిని పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సావిత్రి జీవితంలో కీలక వ్య‌క్తులైన‌ ఎన్టీ రామారావు, అక్కినేని పాత్రల కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను, నాగచైతన్య‌ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments