ఆ హీరోయిన్ అందానికి 'ఫిదా' అయిన మాటల మాంత్రికుడు?

తెలుగు వెండితెరకు పరిచయమైన కొత్త హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఈమె అందానికి టాలీవు్డ్‌లో అనేక మంది హీరోలతో పాటు.. డైరక్టర్లు కూడా ఫిదా అయిపోయారు. ఫలితంగా తాము తీసే చిత్రాల్లో అనూను హీరోయిన్‌గా స

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (12:42 IST)
తెలుగు వెండితెరకు పరిచయమైన కొత్త హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఈమె అందానికి టాలీవు్డ్‌లో అనేక మంది హీరోలతో పాటు.. డైరక్టర్లు కూడా ఫిదా అయిపోయారు. ఫలితంగా తాము తీసే చిత్రాల్లో అనూను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకునేందుకు పోటీపడుతున్నారు. ఇలాంటి వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. 
 
నాని ప్రధాన పాత్రలో రూపొందిన 'మజ్ను' చిత్రంతో అను తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో పవన్ కళ్యాణ్‌ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ అమ్మడిని తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని మాటల మాంత్రికుడు భావిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే "జై లవ కుశ" చిత్రం షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమా ఈనెల 21వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో తారక్‌కి జోడిగా అను ఎమ్మాన్యుయేల్‌ని సెలక్ట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్ట సమాచారం. 
 
అను ఎమ్మాన్యుయేల్ ప్రస్తుతం పవన్ సినిమాతో పాటు బన్నీ- వక్కంతం వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న "నా పేరు సూర్య. . నా ఇల్లు ఇండియా" అనే చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. మొత్తంమీద త్రివిక్రమ్‌ను ఇట్టే ఆకర్షించిన అనుకు ఇక టాలీవుడ్‌లో తిరుగులేదని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హర్యానాలో కొనసాగుతున్న పోలీస్ అధికారుల ఆత్మహత్యలు... పూరన్ కుమార్‌పై సంచలన ఆరోపణలు

మాగంటి సునీతపై కేసు నమోదు.. కుమార్తె మాగంటి అక్షర పేరు కూడా..?

Liquor scam: మిధున్ రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించిన సిట్

వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడిని పట్టించిన సోదరి

రిజర్వేషన్లు బీసీల హక్కు : ప్రొఫెసర్ కోదండరాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments