Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'జై లవ కుశ'కు యు/ఏ సర్టిఫికేట్... మరో బ్లాక్ బస్టర్ ఖాయమట...

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్ర "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే,

Advertiesment
'జై లవ కుశ'కు యు/ఏ సర్టిఫికేట్... మరో బ్లాక్ బస్టర్ ఖాయమట...
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (11:19 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్ర "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ చిత్రం ఇటీవలే ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోగా, తాజాగా, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
 
ఇందులోభాగంగా, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు... ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ టాక్ ఎలా ఉందో వెల్లడించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని... మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని కితాబిచ్చారు. సినిమా చాలా బాగా వచ్చిందని... ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రాన్స్‌జెండ‌ర్‌గా న‌టిస్తున్న‌ స్టార్ హీరో..!