Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి గాడ్ ఫాదర్ నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (19:02 IST)
Satyadev
మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్‌ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే చాలా మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ ఇటివల విడుదలైన గ్లింప్స్, టీజర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది.
 
ఈరోజు ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో సత్యదేవ్, జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రాజకీయ నేతగా చాలా హుందాగా కనిపించారు సత్యదేవ్. 
 
ఈ చిత్రంలో నయనతార, పూరి జగన్నాధ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే నయనతార ఫస్ట్ లుక్ విడుదలైయింది. సత్యప్రియ జైదేవ్ గా నయనతార ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు  జైదేవ్ గా సత్యదేవ్ ఫస్ట్ లుక్ కూడా క్యూరియాసిటీని పెంచింది. 
 
ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు, కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్.
 
గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది. 
 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్పణ: కొణిదెల సురేఖ
బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం: ఎస్ ఎస్ థమన్
డీవోపీ: నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు
పీఆర్వో: వంశీ-శేఖర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments