Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ అగర్వాల్ 'సత్యభామ' టీజర్ ఎలా వుందంటే...

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (16:50 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం "సత్యభామ". ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఇది కాజల్ నటించిన 60వ చిత్రం. పైగా, పూర్తిగా లేడీ ఓరియంటెడ్ మూవీ. దీంతో ఈ చిత్రంపై ఆది నుంచి అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కాజల్ అగర్వాల్ బర్త్‌డేను పురస్కరించుకుని గత జూన్ నెలలో ఈ చిత్రం గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన చిత్ర బృందం.. శుక్రవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. గ్లింప్స్‌లోనే ఓ రేంజ్ యాక్షన్ చూపించిన కాజల్.. టీజర్‌లో అంతకుమించి అదరగొట్టేశారు. కాజల్ ఫ్యాన్స్‌కి టీజర్ దీపావళి బొనంజాగా ఉంది. 
 
ఈ టీజర్‌ను చూస్తుంటే, ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా అర్థమవుతుంది. పోలీస్ ఆఫీసర్ సత్యభామ హ్యాండిల్ చేస్తున్న కేసులో అనుకోకుండా ఒక వ్యక్తి మరణించడం, సత్యభామని ఆ కేసు నుంచి తొలగించడం, కానీ తన వల్ల ఒక తప్పు జరిగిందన్న కోపంతో సత్యభామ, ఆ కేసుని ఆఫ్ డ్యూటీలో ఇన్వెస్టిగేషన్ చేయడం ఈ సినిమా స్టోరీగా తెలుస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సత్యభామగా కాజల్ వావ్ అనిపిస్తున్నారు. అఖిల్ డేగల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ టీజర్‌కు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చాలా హైలెట్‌గా నిలిచింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments