Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలెంట్ ఉంటే అమ్మాయిలు అమ్ముడుపోవాల్సిన అవసరమేముంది?

అమ్మాయిల్లో టాలెంట్ ఉంటే అమ్ముడు పోవాల్సిన అవసరమేముంది అని బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ అంటున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలు క్యాస్టింగ్ కౌచ్ కుదిపేస్తున్న ఈ నేపథ్యంలో ఆమె క్యాస్టింగ్ కౌచ్‌ప

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (13:06 IST)
అమ్మాయిల్లో టాలెంట్ ఉంటే అమ్ముడు పోవాల్సిన అవసరమేముంది అని బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ అంటున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలు క్యాస్టింగ్ కౌచ్ కుదిపేస్తున్న ఈ నేపథ్యంలో ఆమె క్యాస్టింగ్ కౌచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
 
'క్యాస్టింగ్ కౌచ్' అనేది ఒక్క సినిమా రంగంలోనే ఇది లేదనీ, అన్ని రంగాల్లో ఇది కామనైపోయిందన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ శాఖల్లో కూడా వేధింపులు అధికంగానే ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. 
 
నిజానికి కష్టపడితే తిండి ఎక్కడైనా దొరుకుతుందన్నారు. అందువల్ల అమ్మాయిలు అమ్ముడుపోవాల్సిన అవసరమేముందని ఆమె ప్రశ్నించారు. అదేసమయంలో టాలెంట్ ఉంటే ఆఫ‌ర్స్ అవే వెతుక్కుంటూ వ‌స్తాయి. కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారాల్లో అమ్మాయిల నిర్ణయమే కీలకమన్నారు. 
 
క్యాస్టింగ్ కౌచ్‌పై మళ్లీ చెబుతున్నా... ఇది ఒక్క సినిమా రంగానికే సంబంధించిన వ్యవహారమే కాదు యావత్‌ సమాజానికి సంబంధించింది. దయచేసి ఇండ‌స్ట్రీని బ్లేమ్ చేయోద్దు అని కోరుతున్నాను అని స‌రోజ్ ఖాన్ అన్నారు. ఈమె సుమారు రెండువేలకు పైగా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments