Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకు నిరాకరించిన హీరోయిన్.. మద్యంబాటిల్ విసిరిన నిర్మాత!

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (11:04 IST)
కన్నడ చిత్ర సీమలో ఓ హీరోయిన్, నిర్మాత గొడవపడ్డారు. ఒక దశలో నిగ్రహం కోల్పోయిన నిర్మాత... తన చేతిలోని మద్యం బాటిల్‌ను హీరోయిన్‌పై విసిరివేశాడు. అయితే, అదృష్టవశాత్తు ఆ బాటిల్ ఆమెపై పడలేదు. దీంతో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనపై హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇంతలో మరికొందరు బడా నిర్మాతలు వచ్చి పోలీస్ స్టేషన్‌లో రాజీ కుదర్చడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆదివారం రాత్రి రిచ్‌మండ్‌టౌన్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో హీరోయిన్ సంజనా గుల్‌రాణి, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్‌లు బస చేశారు. ఓ మూవీ కథా చర్చలు జరుగుతుండగా, వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో వారిద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో హీరోయిన్‌పై నిర్మాత మద్యం బాటిల్ విసిరారు. 
 
దీనిపై వందనా నగరంలోని కబ్బన్‌పార్కు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా మధ్యవర్తులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖుల జోక్యంతో రాజీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై శుక్రవారం సంజనా మాట్లాడుతూ.. వందనాజైన్‌తో గొడవ జరిగిందని, అది చిన్నపాటిదేనని, తమ మధ్య చాలాకాలంగా సన్నిహితం ఉందని అన్నారు. హోటల్‌లో గొడవ రాజీ చేసుకున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments