Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాదంలో ఇన్ఫోసిస్.. సీన్లోకి వచ్చిన విజిల్ బ్లోయర్స్.. ఇక ఇక్కట్లు తప్పవా?

Advertiesment
వివాదంలో ఇన్ఫోసిస్.. సీన్లోకి వచ్చిన విజిల్ బ్లోయర్స్.. ఇక ఇక్కట్లు తప్పవా?
, శుక్రవారం, 15 నవంబరు 2019 (11:05 IST)
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే గుర్తుతెలియని ఉద్యోగులు అంటే విజిల్ బ్లోయర్ సెప్టెంబర్ 20వ తేదీన బోర్డుకు రెండు పేజీల లేఖలో అనైతిక పద్ధతులపై ఆరోపించారు. స్వల్ప వ్యవధిలోనే బ్లోయర్లు ఇన్ఫోసిస్‌ సారథులపై రెండోసారి ఫిర్యాదు చేశారు. కంపెనీ లాభాలను ఎక్కువ చేసి చూపేందుకు అనైతిక పద్ధతులను ఉపయోగిస్తున్నారని బ్లోయర్లు ఆ లేఖలో ఆరోపించింది. 
 
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్‌పై ఫిర్యాదు చేసిన విషయాన్ని మరవకముందే.. మరొక విజిల్‌ బ్లోయర్‌ ఈ సీఇఓకు వ్యతిరేకంగా కంపెనీ చైర్మన్‌, సహవ్యవస్థాపకుడు నందన్‌ నీలకేని, ఇతర స్వతంత్ర బోర్డు డైరక్టర్లకు లేఖ రాశారని ఓ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. 
 
ఇన్ఫోసిస్‌ సిఇఒగా సలీల్‌ పరేఖ్‌ 20 నెలల కిందట నియమితులయ్యారు. నియమావళి ప్రకారం ఆయన బెంగుళూరు నుంచి తన కార్యకలాపాలను కొనసాగించాలి. కానీ ఆయన ఇప్పటికీ కూడా ముంబై నుంచే కంపెనీని నిర్వహణ చూస్తున్నారని విజిల్ బ్లోయర్‌ తాజా లేఖలో ఆరోపించారు. 
 
తాను ఇన్ఫోసిస్‌లో ఫైనాన్స్‌ డిపార్టమెంట్‌లో పనిచేస్తున్నానని, ప్రతీకారం తీర్చుకుంటారన్న భయంతో తన వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడంలేదని చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని తేది, పేరులేని ఈ లేఖలో ఆయన కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ముగ్గురు ప్రొఫెసర్ల వల్లే చనిపోతున్నా : ఐఐటీ-ఎం విద్యార్థిని ఫాతిమా