Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో "పద్మావతి" రచ్చ : రిలీజ్ వద్దు... విడుదల చేయాల్సిందే...

బాలీవుడ్‌లో 'పద్మావతి' మూవీ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ చిత్రం యావత్తూ మద్దతు ప్రకటించింది. కానీ, శివసేన మాత్రం ఈ చిత్ర విడుదలను నిలిపివేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది.

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (14:25 IST)
బాలీవుడ్‌లో 'పద్మావతి' మూవీ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ చిత్రం యావత్తూ మద్దతు ప్రకటించింది. కానీ, శివసేన మాత్రం ఈ చిత్ర విడుదలను నిలిపివేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది. దీంతో 'పద్మావతి' రగడ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. 
 
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన చిత్రం 'పద్మావతి'. ఇందులో రణ్‌వీర్, దీపికాలు హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం అసభ్యకర, హిందూమతాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని అందువల్ల చిత్రాన్ని రిలీజ్ చేయరాదంటూ అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో 'పద్మావతి' చిత్రం విడుదలను నిషేధించాలని మహారాష్ట్ర ఎమ్మెల్యే సుజిత్‌సింగ్ ఠాకూర్ సీఎం ఫడ్నవిస్‌ను కోరారు. ఈ మేరకు ఆయన సీఎం ఫడ్నవిస్‌కు ఓ లేఖ రాశారు. 'పద్మావతి' సినిమా విడుదలపై ఆందోళనల నేపథ్యంలో సామాజిక వర్గాల నేతలకు స్పెషల్ షో వేయాలని సుజిత్‌సింగ్ సీఎం ఫడ్నవిస్‌ను కోరారు.
 
మరోవైపు, పద్మావతి మూవీకి బాలీవుడ్ ఇండస్ట్రీ, టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ మద్దతుగా నిలిచింది. ఈ మేరకు అసోసియేషన్ ముంబైలో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసింది. బన్సాలీ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని.. విడుదలకు పూర్తిగా మద్దతిస్తున్నట్లు టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. 
 
కాగా, సంజయ్ లీలా బన్సాలీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా రిలీజ్ చేసేందుకు 'పద్మావతి' మూవీని ఆందోళనకారుల కోసం స్పెషల్ షో వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ షోను తిలకించిన తర్వాతైనా ఆందోళనకారులు సద్దుమణిగిపోతారో లేదో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments