Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

తిరుమల శ్రీవారి ఆలయం ముందు దీపికా పదుకొణే ఏం చేసిందంటే...(వీడియో)

బాలీవుడ్ సినిమాల్లో దీపికా పదుకొణే అగ్ర హీరోయిన్. అగ్రహీరోల నుంచి యువ హీరోల వరకు అందరితోను నటించింది ఈ హీరోయిన్. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు. టాలీవుడ్ లోను హీరోయిన్‌గా అందరినీ ఆకట్టుకుంది. పద్మావతి సినిమాలో ప్రస్తుతం నటిస్తున్న దీపికా పదుకొణే, త

Advertiesment
Deepika Padukone
, శనివారం, 11 నవంబరు 2017 (16:53 IST)
బాలీవుడ్ సినిమాల్లో దీపికా పదుకొణే అగ్ర హీరోయిన్. అగ్రహీరోల నుంచి యువ హీరోల వరకు అందరితోను నటించింది ఈ హీరోయిన్. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు. టాలీవుడ్ లోను హీరోయిన్‌గా అందరినీ ఆకట్టుకుంది. పద్మావతి సినిమాలో ప్రస్తుతం నటిస్తున్న దీపికా పదుకొణే, తన సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామి సేవలో పాల్గొంది.
 
దర్శనం తరువాత బయటకొచ్చిన దీపికా పక్కనే ఉన్న తన తల్లి ఉజాలాతో కలిసి నడుస్తూ వెళ్ళింది. ఉన్నట్లుండి అమ్మకు ముద్దులిచ్చింది దీపికా. ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే ముద్దులు ఇవ్వడంతో వారికేం అర్థం కాలేదు. తల్లి మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అలాంటిది అందరూ చూస్తుండగా ఇలా బహిరంగంగా.. పవిత్రత కలిగిన ఆలయం ముందు ముద్దులు పెట్టడం పైన విమర్శలు వస్తున్నాయి. వీడియో...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరమ్‌తో నయనతార లేడి సూపర్ స్టార్ కావడం ఖాయమేనా?