Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను నా మతాన్ని కోల్పోతున్నాను : రణ్‌వీర్

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్, దీపికాలు నటించిన తాజా చిత్రం "పద్మావతి". సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది.

Advertiesment
నేను నా మతాన్ని కోల్పోతున్నాను : రణ్‌వీర్
, ఆదివారం, 12 నవంబరు 2017 (11:49 IST)
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్, దీపికాలు నటించిన తాజా చిత్రం "పద్మావతి". సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ వివాదం నుంచి ఈ చిత్రాన్ని బయటపడేసేందుకు చిత్ర నిర్మాత, దర్శకుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో హీరో ర‌ణ్‌వీర్ సింగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. ర‌ణ్‌వీర్ చేసిన కామెంట్ ఇప్పుడు మ‌ళ్లి ఏ కొత్త స‌మ‌స్య తెచ్చి పెడుతుందా అని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో ర‌ణ్‌వీర్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. 
 
తాజాగా ఈ న‌టుడు త‌న ట్విట్ట‌ర్‌లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ హెయిర్‌ స్టయిల్‌తో ఉన్నఫొటోను పెట్టి.. "నేను నా మతాన్ని కోల్పోతున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమార‌మే లేపుతుంది. సోష‌ల్ మీడియాలో ఈ ట్వీట్‌పై భారీ చర్చ నడుస్తుండ‌గా, ఇది ఎంత దూరం వెళుతుందో చూడాలి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'థాంక్యూ ఆంటీ' అంటున్న గరుడవేగ హీరోయిన్... ఎవర్నీ?