Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

డీవీ
శనివారం, 30 నవంబరు 2024 (10:38 IST)
Jason Sanjay, Sandeep Kishan
లైకా ప్రొడ‌క్ష‌న్స్ చిత్ర నిర్మాణ సంస్థ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ సినీ ఇండ‌స్ట్రీలో, సినీ ప్రేక్ష‌కులు, మీడియాలో ఆస‌క్తిని రేకెత్తించింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నట్లు పలువురి న‌టీన‌టుల చుట్టూ అల్లుకున్న ఊహాగానాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ నేప‌థ్యంలో మూవీ మోషన్ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేయడం అంద‌రిలోనూ నూత‌నోత్సాహాన్ని నింపింది.  
 
ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ జికెఎం త‌మిళ్ కుమ‌ర‌న్ మాట్లాడుతూ ‘‘ప్రారంభం నుంచి మంచి కథకులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే జాసన్ సంజయ్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం. ఆయ‌న తెర‌కెక్కించబోతున్న క‌థ, ఆయ‌న నెరేష‌న్ విన్న‌ప్పుడు డిఫ‌రెంట్‌గా అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా, పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే ప్ర‌ధాన‌మైన పాయింట్‌ ఉంది. మ‌నం ఎక్క‌డా పొగొట్టుకున్నామో అక్క‌డే వెత‌కాలి అన‌టాన్ని మనం చాలా సంద‌ర్భాల్లో వినే ఉంటాం. కానీ దాని కోసం మ‌నం ఏం వెచ్చిస్తామ‌నేదే ప్ర‌ధాన పాయింట్‌గా సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. 
 
ఈ చిత్రంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన సందీప్ కిష‌న్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఈ స‌రికొత్త కాంబో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభ‌వాన్నిస్తుంద‌ని మేం భావిస్తున్నాం’’ అన్నారు. సినిమాకు సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుతూ ‘‘తమన్ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నారు. ఇంకా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం. త్వ‌ర‌లోనే వారి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం. 2025 జ‌న‌వ‌రి నుంచి సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నాం’’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments