ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. చావుబతుకుల్లో ఉన్న ఓ రోగికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించడంలో సాయం చేశారు. ఆయన చొరవతో ఓ కిడ్నీ మార్పిడి చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని డాక్టల్ లీలాకృష్ణ తన ఇన్‌స్టాలో వెల్లడించారు.
థ్యంక్యూ డియర్ తమన్.. ఏఐఎన్‌యూ ఆస్పత్రిలో రోగికి కిడ్నీ మార్పిడి చికిత్సను విజయవంతంగా జరిగేలా చూశావు. నీ కైండ్ హార్ట్‌ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అని ఆ పోస్టులో పేర్కొన్నారు. గాడ్ ఈజ్ గ్రేట్ డియర్ డాక్టర్ అంటూ లీలాకృష్ణకి తమన్ రిప్లై ఇచ్చాడు. తమన్ మంచి మనసు గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా, తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడుగా కొనసాగుతున్న తమన్... అనేక మంది స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. బుల్లితెర మ్యూజిక్ షోలకు కూడా తమన్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తమన్ ఫ్యాన్స్‌తో ఎపకుడూ టచ్‌లో ఉంటారు. అందరికంటే ముందుగానే తాను సంగీతం అందిస్తున్న చిత్రాల అప్డేట్ పంచుకుంటారు.