Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరెడ్డిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు... వదిలేయండి మహాప్రభో అంటున్న...

Advertiesment
Srireddy

ఠాగూర్

, శుక్రవారం, 15 నవంబరు 2024 (12:00 IST)
గత వైకాపా ప్రభుత్వ పాలనలో నోటికి పనిచెప్పి, విపక్ష నేతలను దుర్భాషలాడుతూ అసభ్య పదజాలంతో వీడియోలు పోస్టు చేసిన వారి నటి శ్రీరెడ్డి ఒకరు. ఆమె ఇపుడు వణికిపోతున్నారు. కారణం ఆమెపై ఏపీ వ్యాప్తంగా పలు కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, ఆమెపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 
 
టీడీపీ నేతలపై సామాజిక మాధ్యమాల్లో రెచ్చ గొట్టే ప్రకటనలు చేసినందుకు సినీ నటి శ్రీరెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు గురువారం ఈ కేసును నమోదు చేశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితపై అత్యంత అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి.. వారి ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్న సినీ నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ నేతలు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో శ్రీ రెడ్డిపై 192, 196, 53(1)(బి), 352(3), 75(1)(4), 79 బీఎన్ఎఎస్ చట్టం, సెక్షన్ 67, 67(ఎ) ఐటీ చట్టం, సెక్షన్ 3(1)(డబ్ల్యూ) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, విజయవాడలోని కృష్ణలంక పోలీసులు కూడా శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. దళిత మహిళ అయిన హోంమంత్రి వంగలపూడి అని తను కించపరుస్తూ అతి దారుణంగా పోస్టులు పెట్టిన శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న 'దేవర'