Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ డాకూ మహరాజ్ - తాజా అప్ డేట్ !

Daku maharaj

డీవీ

, మంగళవారం, 12 నవంబరు 2024 (17:58 IST)
Daku maharaj
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తన 109వ సినిమా గురించి చిత్ర నిర్మాత నాగవంశీ దీపావళికి పెద్ద అబ్ డేట్ వస్తుందని ప్రకటించారు. కానీ ఆ సమయానికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాలేకపోయిందని తెలిపారు. తాజాగా ఈ సినిమా తాజా అప్ డేట్ గురించి పోస్టర్ ద్వారా వెల్లడించారు. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్  పై ఈ చిత్రం రూపొందుతోంది.
 
ఈ సినిమా టైటిల్, టీజర్ ను నవంబర్  15వ తేదీన విడుదల చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. బాలక్రిష్ణ వెనుక చేతులు కట్టుకుని తుపాకీ, కత్తి పట్టుకున్న పోరాట యోధునిగా చూపిస్తూ ఈ పోస్టర్ వుంది. పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కుతుంది. ఈ పోస్టర్ ను బట్టి డాకూ మహరాజ్ గా సినిమా టైటిల్ వుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసారు. అలాగే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 

కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా, నవంబర్ 15న 'NBK109' టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. విభిన్న దుస్తులు ధరించి, ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధాలను చేతబట్టిన బాలకృష్ణ లుక్ ఎంతో శక్తివంతంగా ఉంది. నెత్తురంటిన గొడ్డలిని పట్టుకొని, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో బాలకృష్ణ నిల్చొని ఉన్న రూపం మరో స్థాయిలో ఉంది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను ఎన్నో రెట్లు పెంచేలా ఉంది.
 
ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సంచలన స్వరకర్త ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం, 2025 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగమ్ బా యూట్యూబర్ గోల్డ్ ప్లే బటన్‌ను అన్ బాక్స్ చేసిన తరుణ్ భాస్కర్‌