హిందీలోనూ సందీప్ కిషన్, విజయ్ సేతుపతి మైఖేల్ చిత్రం

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (15:59 IST)
Sandeep Kishan, Divyansha
సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన 'నువ్వుంటే చాలు' ఫస్ట్ సింగిల్ చాలా క్యూరీయాసిటీని పెంచాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ తన సోల్ ఫుల్ సింగింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఈ పాట మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
 
మైఖేల్ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అనౌన్స్మెంట్ పోస్టర్ లో ప్రధాన నటీనటులందరినీ రా, రస్టిక్ లుక్స్ లో ప్రజంట్ చేశారు. సందీప్ కిషన్ ముఖంపై గాయాలతో కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి సిగరెట్ వెలిగిస్తూ కనిపించారు. గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ లు కూడా పోస్టర్ లో కనిపించారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది.
 
ఈ చిత్రాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి తో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు ల జాయింట్ ప్రొడక్షన్ వెంచర్. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.  
 
స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.కిరణ్ కౌశిక్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ అందిస్తున్నారు.
 
తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ భరద్వాజ్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

IIT Bombay: హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేసి చిక్కిన ఓల్డ్ స్టూడెంట్.. చివరికి?

కోడలు గర్భిణి.. అయినా చంపేశాడు... గొడ్డలి, కత్తితో దాడి చేసి..?

Nara Lokesh: ఆస్ట్రేలియాకు నారా లోకేష్.. దీపావళి బహుమతిని అలా తెస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments