Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సందీప్ కిష‌న్‌, విజ‌య్ సేతుప‌తి మైఖేల్ ఎంతవరకు వచ్చింది!

Sandeep Kishan, Divyansha
, సోమవారం, 26 డిశెంబరు 2022 (10:04 IST)
Sandeep Kishan, Divyansha
సందీప్ కిషన్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' టీజర్‌లో యాక్షన్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. దీని కోసం సందీప్ కిషన్ అద్భుతంగా ట్రాన్స్ ఫర్మెషన్ అయ్యారు. ఈ చిత్రాన్ని రంజిత్ జయకోడి  దర్శకత్వం వహిస్తుండగా, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి,  కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు ల జాయింట్ ప్రొడక్షన్ వెంచర్. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.
 
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘మైఖేల్’ ఫస్ట్ సింగిల్‌ను విడుదల తేదీని ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసారు నిర్మాతలు. ఫస్ట్ సింగిల్ 'నువ్వుంటే చాలు' డిసెంబర్ 28న విడుదల కానుంది. పోస్టర్ లో సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ రొమాంటిక్ గా, చూడముచ్చటైన కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫస్ట్  సింగిల్ లీడ్ పెయిర్‌ ల బ్యూటీఫుల్ రొమాంటిక్ నంబర్‌గా ఉంటుందని సులభంగా ఊహించవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటను విడుదల చేయనున్నారు.
 
స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కిరణ్ కౌశిక్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.
 
తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ భరద్వాజ్ తదితరులు
 
సాంకేతిక విభాగం:దర్శకత్వం: రంజిత్ జయకొడి, నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, సమర్పణ: నారాయణ్ దాస్ కె నారంగ్,  సంగీతం: సామ్ సిఎస్,  డీవోపీ: కిరణ్ కౌశిక్
డైలాగ్స్: త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్,  రంజిత్ జయకోడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ : కె. సాంబశివరావు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు ఈ ఏడాది సెకండాఫ్ చాలా బాగుంది. అనుపమ పరమేశ్వరన్