మీనాక్షి గోస్వామి నాయికగా వారాహి చిత్రం

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (15:50 IST)
Meenakshi Goswami, Sumanth. Santhosh
వారాహి అమ్మవారిని ఏడు శక్తి రూపాల్లో ఒకరిగా కొలుస్తారు. ఏడుగురు దేవతా మాతృమూర్తుల్లో వారాహి ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మ వారి ఆలయ నేపథ్యంతో సుమంత్ హీరోగా వారాహి చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. వీరి కాంబినేషన్ లో గతంలో సుబ్రహ్మణ్యపురం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో సుమంత్, సంతోష్ జాగర్లపూడి కొత్త చిత్రం వారాహిపై ఆసక్తి ఏర్పుడుతోంది.
 
ఈ చిత్రంలో నాయికగా రాజస్థానీ ముద్దుగుమ్మ మీనాక్షి గోస్వామి నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సెలబ్రేషన్స్ ను వారాహి చిత్ర బృందం జరిపింది. దర్శకుడు సంతోష్,  హీరో సుమంత్, నిర్మాతలు ఆమెకు బర్త్ డే విశెస్ తెలిపారు. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
 
సత్యసాయి శ్రీనివాస్, గెటప్ శ్రీను, కృష్ణ చైతన్య తదితరులు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - ఈశ్వర్ చంద్. ఈ సినిమాలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తన కంటే 50 ఏళ్లు చిన్నదైన మహిళకు రూ. 1.60 కోట్లిచ్చి వివాహం చేసుకున్న 74 ఏళ్ల వృద్ధుడు

Baby Boy: మైసూరు రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్ అయిన శిశువును 20 నిమిషాల్లోనే కాపాడారు.. ఎలా?

Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్.. 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. ఆర్థికంగా నష్టపోవడంతో?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు : బరిలో 58 మంది అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లో ఏనుగుల కదలికలపై నిఘా పెంచాలి: పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments