Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ritu Varma: మజాకా లో రోమాన్స్ పెంచిన సందీప్ కిషన్, రీతు వర్మ

దేవి
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (15:37 IST)
Sandeep Kishan, Ritu Verma
సందీప్ కిషన్ 30వ మూవీ 'మజాకా' సినిమాలో సందీప్ కిషన్, రీతు వర్మ ల ఫోటోలను చుస్తే రోమాన్స్ పెంచినట్లు కనిపిస్తుంది. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్  హిలేరియర్స్ ఎంటర్టైమెంట్ ని అందించింది. ఈ చిత్రం ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ ల కొలాబరేషన్ లో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. సహ నిర్మాత బాలాజీ గుత్తా. రీతు వర్మ  హీరోయిన్ గా నటిస్తున్న మజాకాలో రావు రమేష్ అన్షు కూడా కీలక పాత్రల్లో నటించారు.
 
ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. మొదటి సింగిల్ బ్యాచులర్స్ ఆంథమ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు విడుదలైన సెకండ్ సింగిల్ బేబీ మా చార్ట్ బస్టర్ లవ్ సాంగ్.  ఈ పాటలో సందీప్ కిషన్ ప్రేమలో పడిన కథను బ్యూటీఫుల్ గా చూపించారు.
 
ఈ పాట సందీప్ తండ్రి రావు రమేష్, అన్షు ప్రేమకథను కూడా ప్రెజెంట్ చేస్తోంది. ట్రాక్ సెకండ్ పార్ట్ లో ఆమె తనను వివాహం చేసుకోవాలని ఎంచుకుంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో హీరో నమ్మకంగా చెబుతాడు. వారి జీవితాలు ప్రతిరోజూ వాలెంటైన్స్ డే లాగా ఉండాలని కోరుకుంటాడు.
 
సందీప్ కిషన్ ఎనర్జిటిక్ గా కనిపించారు. ఎలిగెంట్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు.  ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం, లియోన్ జేమ్స్ సంగీతం పాటని మరింత బ్యూటీఫుల్ గా మార్చాయి.
 
త్రినాధ రావు నక్కినతో విజయవంతమైన ప్రాజెక్టులలో కొలబారేట్ అయిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, మజాకాకు కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ రాస్తున్నారు.
 
ఈ చిత్రానికి నిజార్ షఫీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్  వహిస్తుండగా, పృధ్వీ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.
 
మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మజాకా థియేటర్లలోకి రానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments