Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు త్రినాధ రావు

Advertiesment
director Trinadha Rao

డీవీ

, సోమవారం, 13 జనవరి 2025 (17:26 IST)
director Trinadha Rao
దర్శకుడిగా  మేం వయసుకు వచ్చాం, ధమాకా వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న త్రినాథరావు తాజాగా నిర్మాతగా కూడా మారాడు. యూత్ ఫుల్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. తాజాగా సందీప్ కిషన్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్. గత రాత్రి సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో యాంకర్, నటీమణులను ఉద్దేశించి అసభ్యపదాలు పలకడంతో సోషల్ మీడియాలో పలు రకాలుగా విమర్శలు వచ్చాయి.
 
దాంతో ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోపాటు మహిళా సంఘాలు కూడా కేస్ వేయాలనుకోవడంతో త్రినాథరావు ఓ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, మరియు నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను అంటూ తెలియజేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గేమ్ చేంజర్ పైరసీ ప్రింట్ లీక్ పై సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్