Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

Advertiesment
Sandeep Kishan, Ritu Verma

దేవి

, శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (18:55 IST)
Sandeep Kishan, Ritu Verma
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
ఈరోజు మేకర్స్ మజాకా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. హైలీ ఎంటర్ టైనింగ్ మూవీ మజాకా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో  సందీప్ కిషన్, రీతు వర్మ స్టయిలీస్ అండ్ కలర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది.
 
మాస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో త్రినాధ రావు నక్కిన  మరోసారి తన మార్క్ చూపించబోతున్నారు. త్రినాధ రావు నక్కినతో విజయవంతమైన ప్రాజెక్టులలో కొలబారేట్ అయిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, మజాకాకు కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ రాస్తున్నారు. ఈ కాంబోలో ఇది మరో మెమరబుల్ ఎంటర్‌టైనర్ అవుతుందని హామీ ఇస్తుంది.
 
మజాక టీజర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. నిజార్ షఫీ డీవోపీగా పని చేస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.  
 
తారాగణం: సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్