Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్‌ కేసు.. ఛార్జీషీటులో రాగిణి ద్వివేది, సంజన గల్రానీల పేర్లు

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (10:06 IST)
Sanjana_Ragini
కన్నడ శాండల్‌వుడ్‌లో ఇటీవల కలకలం రేపిన డ్రగ్స్‌ కేసులో నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీతో పాటు మరో 25 మందిపై సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌, కాటన్‌పేటే పోలీసులు మంగళవారం ఎన్‌డిపిఎస్‌ కోర్టులో చార్జిషీట్‌ సమర్పించారు. 
 
డ్రగ్స్ వాడకం, అక్రమ రవాణా వంటి ఆరోపణలతో 2020 సెప్టెంబరు మొదటివారంలో రాగిణి, ఆ తరువాత కొన్నివారాలకు సంజనను అరెస్టు చేసి 3 నెలలకు పైగా జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. ఆ తరువాత బెయిల్‌పై బయటకు వచ్చారు. 
 
ఈ క్రమంలో వీరితో పాటు మరో 25 మందిపై డ్రగ్స్‌ ముఠాలు, వాటి దందాలకు సంబంధించి సుమారు 2,900 పేజీలతో చార్జిషీట్‌ను సమర్పించారు. 180 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిపేర్లు కూడా చార్జిషీట్‌లో ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments