Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 February 2025
webdunia

సదాకు పుట్టినరోజు.. సిగరెట్లు పీల్చడం అంటే అస్సలు పడదట.. క్యారెక్టర్ రోల్స్ చేస్తుందా?

Advertiesment
సదాకు పుట్టినరోజు.. సిగరెట్లు పీల్చడం అంటే అస్సలు పడదట.. క్యారెక్టర్ రోల్స్ చేస్తుందా?
, బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (10:29 IST)
''జయం'' హీరోయిన్ సదాకు నేడు పుట్టిన రోజు. 1984 ఫిబ్రవరి 17న జన్మించిన సదా.. దక్షిణాది సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సదా ఒకప్పుడు తెరపై కనిపించగానే కుర్రకారు గుండె లయ తప్పేది. ఆమె నాజూకు అందాలకు యూత్ ఫిదా అయ్యేవారు. ఉత్తరాది నుండి దక్షిణాదికి దిగి వచ్చిన అందాలతార సదా మహారాష్ట్ర ముస్లిం కుటుంబంలో జన్మించింది. 
 
కానీ తెలుగు సినిమా ద్వారానే సదా అరంగేట్రం చేసింది. ఆమె తొలిసారి నటించిన చిత్రం 'జూన్-జూలై'... అయితే ఈ సినిమా విడుదల కాకముందే తేజ దర్శకత్వంలో రూపొందిన 'జయం' సినిమాతో జనం ముందు నిలచింది సదా... తొలి సినిమాతోనే ఎందరో ఆరాధకులను సంపాదించుకుంది.
 
'జయం' తమిళ రీమేక్ లోనూ సదా నటించి, అక్కడ కూడా మంచి మార్కులు సంపాదించింది. ఈ నేపథ్యంలోనే శంకర్ తెరకెక్కించిన 'అపరిచితుడు'లో నాయికగా నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించే అవకాశాలు అందిపుచ్చుకుంది. కథక్ డ్యాన్సర్ అయిన సదా.. తెలుగులో జయం, తమిళంలో మాధవన్‌, శ్రీకాంత్‌తో సినిమా చేసింది. ఆపై ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. 
 
సదాకు సినిమాలు చూడటం, సంగీతం వినడం అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ డిజైనింగ్ ఆమెకు చాలా ఇష్టం. కానీ సిగరెట్లు పీల్చేవారంటే అస్సలు పడదు. ప్రస్తుతం ఆమె రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. టార్చ్ లైట్ అనే సినిమాలో వేశ్యగా నటించింది. 
 
అందాలు ఆరబోసేందుకు సై అంటున్నా.. ఆమెకు తగిన పాత్రలు రావట్లేదు. దీంతో క్యారెక్టర్ రోల్స్ చేయడంపై ఆమె దృష్టి పెట్టింది. ఏది ఏమైనా.. సదా పుట్టిన రోజును పురస్కరించుకుని నటిగా గుర్తింపు తెచ్చుకునే పాత్రలు ఆమెను వరించాలని ఆశిద్దాం..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ.. కృష్ణవంశీ దర్శకత్వంలో..?