Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణం తర్వాత చక్కని జీవితం పొందడమే లక్ష్యం.. సినిమాలకు గుడ్‌బై... ఎవరా హీరోయిన్?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:43 IST)
ఆ హీరోయిన్‌లో చాలా మార్పు వచ్చింది. నిన్నామొన్నటి వరకు తన అంద చందాలతో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆ భామ ఇపుడు కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పింది. అదేసమయంలో తాను మరణించిన తర్వాత చక్కని జీవితం పొందడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. ఇందుకోసం తాను చేయాల్సింది చాలా ఉందని తెలిపింది. ఇంతకీ అంతటి కఠిన నిర్ణయం తీసుకున్న హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు.. సనాఖాన్. బాలీవుడ్ నటి. ఈమె బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కూడా. ఇకపై తాను సినిమాలు చేయనని ప్రకటించింది. సినీ పరిశ్రమ నుంచి వైదొలుగుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. దీనికి సంబంధించి ఓ పెద్ద లేఖలో ఇన్‌స్టాలో పోస్టు చేసింది. 
 
ఇక నుంచి తాను సమాజ సేవలో తరిస్తానని.. సృష్టకర్త ఆదేశాలను అనుసరిస్తానని తెలిపింది. తన ఫాలోవర్లను ఉద్దేశిస్తూ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పెద్ద నోట్‌ను రాసింది. గత కొన్ని రోజులుగా తన జీవితంపై తీవ్ర ఆలోచనల్లో ఉన్నట్టు ఆ లేఖలో ఆమె తెలిపింది. ఇది తన జీవితపు కీలకమైన దశ అని ఆమె చెప్పింది. తన జీవితపు అసలైన పరమార్థాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపింది. 
 
డబ్బు, పేరు కోసమేనా ఈ జీవితమని తనలో తాను ప్రశ్నించుకున్నట్టు లేఖలో రాసింది. అవసరార్థుల కోసం.. నిస్సహాయుల కోసమే తన శేషజీవితమని తెలిపింది. చావును ఎదుర్కోక తప్పదా, చనిపోయాక ఏం జరుగుతుందనే ఈ రెండు ప్రశ్నలు గత కొన్ని రోజులుగా తనను వేధిస్తున్నాయని తెలిపింది.
 
ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొనే పనిలో పడ్డాను. ఈ ప్రపంచంలోకి రావడం వెనక అసలు కారణం... మరణం తర్వాత చక్కని జీవితాన్ని పొందడమే. ఈ ఆలోచనల అనంతరం ఈ సినీ జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నా. సమాజ సేవలో ముందుకు సాగాలనకుంటున్నా అన సనాఖాన్ రాసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments