Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్ ప్లాప్‌తో సంబంధంలేకుండా సినిమాలు చేస్తున్న సంపూర్ణేష్ బాబు

Webdunia
గురువారం, 19 మే 2022 (18:15 IST)
Sampoornesh Babu
`కొబ్బరిమట్ట` తర్వాత కొన్ని పెద్ద బ్యానర్స్ లో సినిమా అవకాశాలు వవ్భినా కొన్ని కారణాలు వలన అవి పోస్ట్ ఫోన్ అయ్యాయి. ఇంతలో దర్శకుడు.యన్.ఆర్. రెడ్డి గారు ఈ కథ చెప్పడం జరిగింది. కథ నాకు నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను` అని హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘ధగఢ్ సాంబ’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ ముందుకు రానున్నారు.బి.ఎస్. రాజు సమర్పణలో  ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో  రూపొందిన ఈ సినిమా  మే 20 న విడుదలవుతుంది.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ,   ఇప్పటివరకు నేను ఎక్కువగా కామెడీ రోల్ లో నటించాను. ఇందులో మొదటి సాటి హర్రర్ వైపు అంటే సీరియస్ గా వుండే డీఫ్రెంట్ సబ్జెక్ట్ చేశాను. కొబ్బరి మట్ట,సింగం 123, పెదరాయుడు వంటి సినిమాలో ఎక్కువగా స్కూప్స్ వున్నా ఈ సినిమాలో అలాంటి స్కూప్స్ ఉండవు. ఇందులోని డైలాగ్స్ డీఫ్రెంట్ గా ఉంటాయి.
 
హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా చాలా బాగా చేసింది. అలాగే నాతో పాటు జ్యోతి, బాషా, అప్పారావు నటించారు.
ఈసినిమా లో ఉన్న నాలుగు ఫైట్స్ ను నలుగురు ఫైట్ మాస్టర్స్ తో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో సెంటిమెంట్ తో పాటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ మరియు ఎన్నో.. ట్విస్ట్ టర్న్స్ తో ప్రేక్షకులను ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. 
 
- ఇప్పటి వరకు నేను 12 సినిమాలు హీరోగా చేశాను. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమా ఏడవ సినిమా ఇంకా మూడు సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. ."బ్రిలియంట్ బాబు" సన్నాఫ్ తెనాలి, "దాన వీర శూరకర్ణ", మిస్టర్ బెగ్గర్, మరియు ఒక తమిళ్ సినిమాలో హీరో గా చేస్తున్నాను అది 70% షూట్ కంప్లీట్ అయ్యింది.ఇవి కాకుండా మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ (Video)

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments