Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను ఎంత అతి చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు - సంపూర్ణేష్ బాబు

webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (19:14 IST)
Sampoornesh Babu
ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడ‌డం. న‌ట‌న‌లో అతిగా చేయ‌డం అనేది సంపూర్ణేష్‌బాబు తెలిసిన విద్య‌. ఆ అతే న‌న్ను ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌కు చేర్చింది అంటున్నాడు. ఇది ఎంత‌కాలం వుంటుందో చెప్ప‌లేం కానీ. వ‌చ్చిన అవ‌కాశాన్ని చేసుకుంటూ పోవ‌డ‌మే నా ముందున్న క‌ర్త‌వ్య‌మ‌ని - సంపూర్ణేష్‌బాబు తెలియ‌జేస్తున్నాడు.
 
ఈనెల 26న‌ ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు వ‌స్తున్నాడు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఈ సంద‌ర్భంగా చిత్రం గురించి త‌న కెరీర్ గురించి ఇలా మాట్లాడారు. 
 
- నాపేరు నరసింహాచారి. అక్క‌డ‌ నుంచి సంపూగా ఎదగడం, ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌లో తిరిగే స్థాయి వరకు వచ్చాను. అదే నాకు సంతోషం. ప్రస్తుతం నా చేతిలో ఐదు సినిమాలు ఉండటం అదృష్టం.
 
- నా బ‌యోపిక్‌లాంటిదే  గోల్డ్ మ్యాన్ అనే సినిమా చేద్దామని అనుకున్నాను. కానీ కరోనా వల్ల వెనక్కి వెళ్లిపోయింది. ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయడం నాకు ఆనందంగా ఉంటుంది. తెలియని సంతృప్తినిస్తుంది.
 
- తమిళంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. స్టోరీ బేస్డ్ సినిమా. సీరియస్‌గా సాగుతుంది.
 
- క్యాలీ ఫ్లవర్ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. పెద్దాయన ఆండ్రిఫ్లవర్..రెండో పాత్రకు క్యాలీఫ్లవర్ అనిపెట్టారు. క్యాలీ ఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని నేనూ అడిగాను.  క్యారెక్టర్ పాత్ర పేరు కూడా అదే.. ఒకానొక సమయంలో కాపాడే కవచంగా కూడా మారుతుందని డైరెక్టర్ అన్నారు.
 
- శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ చెప్పాడు. అది చాలా నచ్చింది. కొత్త చెబుతున్నాడని అనిపించింది. అందుకే ఓకే చెప్పాను.
- ఈ సినిమాలో గెటప్స్ బాగా సెట్ అయ్యాయి.. హీరో రేప్‌కు గురవ్వడం, ఆ తరువాత వచ్చే పాటలు ఇలా అన్నీ బాగుంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకే హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల్లా అందరికీ నచ్చుతుందని అన్నాను.
 
- నేను ఎంత అతి చేసినా ప్రేక్షకులు  ఆదరిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కథలు రాస్తుంటారు. హృదయ కాలేయంలో చితిలోంచి లేచి రావడం, కొబ్బరిమట్టలో కొడితే సుమో చేతిలోకి వస్తుంది. అది పరాకాష్ట. సింగం 123సినిమాలో ఇంట్లో స్మిమ్మింగ్ పూల్‌లో దూకితే ఎక్కడెక్కడో తేలుతాను. అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

అఖండ విజువల్ వండర్- బాలకృష్ణ గారి గురించి మాటల్లో చెప్పలేను - మిర్యాల రవిందర్ రెడ్డి