హృదయ కాలేయం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు సంపూర్ణేష్‌బాబు. ప్రస్తుతం క్యాలీ ఫ్లవర్ అనే సరికొత్త టైటిల్‌తో మనముందుకు రానున్నారు. శీలో రక్షతి రక్షిత: అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు..ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ వాసంతి చెప్పిన విశేషాలు.
- ఏరో నాటికల్ ఇంజనీర్ అవుదామని అనుకున్నాను. కానీ కాలేజ్‌లో ఓ సారి ర్యాంప్ వాక్ షోలో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ మొదలైంది.
- మొదట్లో ఈ సినిమా చేయాలా? వద్దా? అని భయపడ్డాను. సంపూ హీరో అని తెలీదు.. టైటిల్ కూడా చెప్పలేదు. కథలో క్యాలీఫ్లవర్ అని ఉంది. కానీ అదే టైటిల్‌గా పెడతారని తెలీదు. తెలుగులో మొదటి సినిమా.. యూనిక్‌గా ఉందని ఒప్పుకున్నాను.
- నేను తెలుగమ్మాయిని. కానీ బెంగళూరులో పెరిగాను. నాకు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఐదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చాను. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చాను. కన్నడలో ఐదు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఈ సినిమా కోసం ఆడిషన్ చేశారు. నిర్మాత ఆశ మేడంకు నచ్చడంతో తీసుకున్నారు. నీలవేణి పాత్రకు సరిపోతాను అని దర్శకుడు నన్ను తీసుకున్నారు.
- బావ వెంటపడుతూ చలాకీగా తిరిగే అమ్మాయి నీలవేణి. ఈ పాత్ర నాకోసమే డిజైన్ చేసినట్టు అనిపించింది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తున్నాను. సినిమా అంతా లంగావోణిలో కనిపిస్తాను. ఈ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది.
- సంపూ పాత్రలో రెండు వేరియేషన్లుంటాయి. క్యాలీఫ్లవర్ కారెక్టర్‌కు మరదలు. ఆయన వెంట పడుతూనే ఉంటాను. కానీ ఆయన నన్ను పట్టించుకోరు. అలాంటి పాత్రను పోషించాను. క్యాలీఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడినే అడగాలి. కానీ ఇది చాలా యూనిక్‌గా ఉంటుంది. ఓ వెజిటబుల్ పేరు పెట్టారేంటి? అని అనుకున్నాను. సంపూ గారికి ఈ టైటిల్ సెట్ అవుతుంది. పోస్టర్ రిలీజ్ చేశాక షాక్ అయ్యాను.
- నీలవేణి పాత్రను చాలా ఎంజాయ్ చేసి చేశాను. లంగావోణిలో కనిపించడం రేర్‌గా ఉంటుంది. అందుకే ఈ చిత్రం నాకు స్పెషల్. ఇదే నా డ్రీమ్ రోల్ అని కూడా చెప్పొచ్చు.
- అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్, మెసెజ్ ఓరియెంటెడ్ ఇలా సినిమాలో అన్నీ ఉంటాయి. ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి. ప్రజ్వల్ మంచి సంగీతాన్ని అందించారు. పోసాని, సంపూ, ముక్కు అవినాష్, రోహిణి, గెటప్ శ్రీను ఇలా అందరితో సీన్లు ఉంటాయి.
- వేసవిలో పాలకొల్లులో షూటింగ్ చేశాం. దాదాపు 19 రోజులు షూట్ చేశాం. ఎంతో సరదాగా గడిచింది. లాక్‌డౌన్‌లోనే షూటింగ్ చేశాం. అందరం వ్యాక్సిన్ వేసుకుని ఆర్ఎఫ్సీలో షూటింగ్ చేశాం.
- ఏ నిర్మాణ సంస్థ అయినా పర్లేదు. నాకు నాని తో సినిమా చేయాలని ఉంది. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం కన్నడ కన్నా తెలుగులోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి.