Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబర్ 26న థియేటర్స్ లో సంపూర్ణేష్‌బాబు - క్యాలీఫ్లవర్‌

నవంబర్ 26న థియేటర్స్ లో సంపూర్ణేష్‌బాబు - క్యాలీఫ్లవర్‌
, శనివారం, 13 నవంబరు 2021 (17:22 IST)
Sampurnesh Babu, Vasanti
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.
 
గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ముజీర్‌ మాలిక్‌ ఛాయగ్రాహకుడు. ఎడిటింగ్‌ బాధ్యతలను బాబు నిర్వ హిస్తున్నారు.
 
నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, వాసంతి, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్‌ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు, విజయ్, కల్యాణీ, సుమన్‌ మనవ్వాద్, ముస్కాన్, బేబీ సహృద, రమణ్‌
దీప్‌
 
సాంకేతిక నిపుణులు-  స్క్రీన్‌ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్కే మలినేని,  ప్రొడ్యూసర్‌: ఆశా జ్యోతి గోగినేని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: హరిబాబు జెట్టి, సమర్పణ: శ్రీధర్‌ గుడూరు, స్టోరీ: గోపి కిరణ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రజ్వల్‌ క్రిష్‌, కెమెరా: ముజీర్‌ మాలిక్‌, డైలాగ్స్‌: రైటర్‌ మోహన్, పరమతముని శివరామ్‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అశోక్ గల్లా హీరో చిత్రం