Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్2 పాన్ ఇండియా సినిమా కాదు.. ఇండియన్ సినిమా- హీరో సిద్ధార్థ్

Webdunia
గురువారం, 19 మే 2022 (18:05 IST)
'కేజీఎఫ్2' సక్సెస్, పాన్ ఇండియా కాన్సెప్ట్‌పై హీరో సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాన్ ఇండియా అనే పదం వినడానికి చాలా ఫన్నీగా ఉందని.. 15 ఏళ్ల నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నానని.. ఏ భాషలో నటిస్తే ఆ భాషకు డబ్బింగ్ చెప్పుకునేవాడినని తెలిపారు. 
 
తనవరకు వాటిని ఇండియా సినిమాలని పిలవడమే ఇష్టమని.. పాన్ ఇండియా అంటుంటే తనకు అగౌరవంగా అనిపిస్తుందని సిద్ధార్థ్ చెప్పారు. ఈ మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని అనడం లేదని స్పష్టం చేశారు.
 
తాజాగా ఈ హీరో నటించిన 'ఎస్కేప్ లైవ్' అనే సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ ను ప్రమోట్ చేసే క్రమంలో ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు సిద్ధార్థ్. 
 
బాలీవుడ్ నుంచి ఒక సినిమా విడుదలై హిట్ కొడితే దాన్ని హిందీ సినిమా అనే అంటారని.. అదే ప్రాంతీయ సినిమాల విషయంలో అలా ఎందుకు ఉండదని సిద్ధార్థ్ ప్రశ్నించారు. 
 
ప్రాంతీయ చిత్రాలను మంచి ఆదరణ లభించి.. భారీ విజయం సాధిస్తే వీటిని పాన్ ఇండియా అని పిలవడం ఎందుకని..? ఇండియన్ సినిమా అని అనొచ్చు కదా అని ప్రశ్నించారు.
 
లేదంటే 'కేజీఎఫ్' జర్నీని గౌరవించి కన్నడ సినిమా అని చెప్పొచ్చు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ సినిమా అని పిలవొచ్చని అన్నారు. 
 
కాబట్టి పాన్ ఇండియా సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా అని చెప్పాలని సూచించారు. పాన్ అంటే ఏమిటో తనకు అర్ధం కావడం లేదని.. ఆ పదం చాలా ఫన్నీగా ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments