Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలిని కేజీఎఫ్-2 మించేయనుందా?

Yash
, సోమవారం, 16 మే 2022 (10:39 IST)
బాహుబలిని కేజీఎఫ్ 2 మించనుంది. భారతీయ సినిమాలో సంచలనంగా మారిన బాహుబలి 2 1800 కోట్ల వసూళ్లను రాబట్టింది. బాహుబలి 2 రికార్డును రాబోయే పదేళ్ల వరకే కాదు ఆ తర్వాత కూడాబ్రేక్ చేయడం సాధ్యం కాదని అంతా భావించారు. ఇప్పుడు కేజీఎఫ్ దాదాపుగా ఆ రికార్డును చేరువ అయ్యింది. 
 
చాలా ఏరియాలో బాహుబలి 2 రికార్డును తూడ్చి పెట్టిన కేజీఎఫ్ 2 బాహుబలి మెయిన్‌ రికార్డును కూడా బద్దలు కొట్టేందుకు సిద్దంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. 
 
ఇదే సమయంలో బాహుబలి సినిమాతో పోల్చితే కేజీఎఫ్ 2 సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ కన్నడ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
కేవలం యాక్షన్ సన్నివేశాలతో కేజీఎఫ్ 2 ను సక్సెస్ చేసిన ఘనత ప్రశాంత్‌ నీల్‌‌కు దక్కింది అంటున్నారు. ఇక 150 కోట్ల బడ్జెట్‌ తో ఏకంగా 1300 కోట్ల వసూళ్లను దక్కించుకున్న సినిమాగా ఈ సినిమా రికార్డు సాధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైటిల్ రేసులో దృష్టిపెట్టిన మిత్రాశర్మ