Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార ప్రియుడి దర్శకత్వంలో సమంత

Webdunia
గురువారం, 4 జులై 2019 (15:58 IST)
పెళ్లైన తర్వాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ విభిన్నమైన కథాంశాలతో కూడిన కథలను ఎంచుకుంటూ సక్సెస్‌లు కొట్టేస్తున్న సమంత… ప్రస్తుతం నందిని రెడ్డి డైరెక్షన్‌లో "ఓ బేబీ" చిత్రంలో నటించింది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే తమిళంలో హిట్ సాధించిన చిత్రం "96" రీమేక్‌లోనూ నటించనుంది. ఈ రెండూ ఇలా ఉండగానే ఆవిడ మరో తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్దం అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
వివరాలలోకి వెళ్తే... లేడీ సూపర్ స్టార్ నయనతారతో ‘అరమ్’ చిత్రాన్ని తెరకెక్కించిన గోపి నైనర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘అరమ్’ చిత్రాన్ని తెలుగులో కర్తవ్యం పేరుతో డబ్బింగ్ చేయగా తెలుగులో కూడా సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. గోపి.. సమంతతో ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం చేయాలనుకుంటున్నారనీ... ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయనీ... ఈ చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments