Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్-3: నాగార్జున షాకింగ్ రెమ్యూనరేషన్... ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 4 జులై 2019 (15:49 IST)
బిగ్‌బాస్-3 సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. గతేడాది ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ గురించి, అలాగే హోస్ట్ చేయడం గురించి నాగ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. అందులో హాస్ట్‌గా చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాడు. అయితే ఈ ఏడాది సీన్ మారింది. 
 
నాగార్జున బిగ్‌బాస్-3కి హోస్ట్‌గా చేయడానికి అంగీకరించాడు. అందుకు కారణం లేకపోలేదు. ఈ సీజన్‌కి గానూ హోస్ట్‌గా చేసేందుకు స్టార్ మా నాగార్జునకు భారీ మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఒక్కో ఎపిసోడ్‌కి నాగ్‌కి 12 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 
 
బిగ్‌బాస్-3 షో మొత్తం 100 రోజుల పాటు సాగనుంది కాబట్టి నాగార్జునకు మొత్తంగా దాదాపు 12 కోట్లు దక్కనుంది. గతంలో కూడా నాగ్ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి గానూ ఒక్కో ఎపిసోడ్‌కి ఏడు లక్షల రూపాయలు తీసుకున్నాడని సమాచారం. బిగ్‍బాస్-3 ఈనెల మూడో వారంలో ప్రారంభం కానుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లు పాల్గొననున్న ఈ షో ఈనెల 21వ తేదీన ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనుమానంతో భార్యను చంపి ముక్కలు చేసి ఉడకబెట్టిన భర్త... ఎముకలు రోట్లోదంచి...

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments