Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈసారి బిగ్ బాస్ నన్ను రంగంలోకి దించుతున్నాడు... బిగ్ బాస్ 3పై నాగ్

Advertiesment
ఈసారి బిగ్ బాస్ నన్ను రంగంలోకి దించుతున్నాడు... బిగ్ బాస్ 3పై నాగ్
, శనివారం, 29 జూన్ 2019 (14:10 IST)
బిగ్ బాస్ 3 త్వర‌లో అని తెలిసిన‌ప్ప‌టి నుంచి ఎవ‌రు ఈసారి హోస్ట్‌గా రానున్నారు అనే ఉత్కంఠ ఏర్ప‌డింది. అలాగే ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌లుగా ఎవరు పాల్గొంటున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ హోస్ట్‌ ఎవరనే విషయం రకరకాల ప్రచారాలు జరిగాయి.

ఫస్ట్ సీజన్లో హోస్ట్‌గా అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సీజన్‌కు దూరమయ్యారు. దీంతో రెండో సీజన్లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. తర్వాత ఆయన కూడా తనదైన శైలిలో షోను నడిపించారు. ఈసారి నాని స్థానంలో కొత్త హోస్ట్ ఎవరనే విషయమై తీవ్ర ప్రచారం జరిగింది. 
 
వెంకీ, విజ‌య్ దేవ‌ర‌కొండ పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ నాగార్జున పేరు ఎక్కువుగా వినిపించ‌డం... మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు పొగ్రామ్ ద్వారా నాగార్జున ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర కావ‌డంతో నాగార్జునే బిగ్ బాస్ 3 హోస్ట్‌గా ఎంపిక చేస్తార‌ని అనిపించింది. అనుకున్న‌ట్టుగానే నాగార్జునే బిగ్ బాస్ 3 హోస్ట్ అని మా టీవీ ప్రొమో ద్వారా ఎనౌన్స్ చేసింది.
 
బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం వంద రోజులకు సరిపడా కూరగాయలు, కోడి గుడ్లు కొనుగోలు చేయడం కోసం మార్కెట్‌కి వెళ్లినట్టుగా నాగార్జునతో ప్రొమో రూపొందించి రిలీజ్ చేసారు. ఈసారి రంగంలోకి నేను దిగుతున్నానంటూ.. నాగ్ బిగ్ బాస్ ప్రారంభానికి ముందే ప్రోమోతో ఆకట్టుకున్నారు. జూలై 21 నుంచి బిగ్ బాస్ 3 ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. మ‌రి.. ఈ సీజ‌న్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పడాలు అమ్మిన బాలీవుడ్ స్టార్ హీరో... ఎవరు.. ఎందుకు?