Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (12:28 IST)
ప్రేమికులైనా, భార్య భర్తలైనా వారు రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. తమ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా ఈ బహుమతులు అందజేస్తుంటారు. గతంలో హీరో నాగ చైతన్య, హీయిన్ సమంత సైతం వారి పెళ్లికి ముందు, తర్వాత ఎన్నో ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చకున్నారు. విడాకులపై సమంత నాగచైతన్య ఎవరికి వారు తమ కారణాలు చెప్పుకున్నప్పటికీ..‌ వారి విడాకులపై అనేక ప్రచారాలు జరిగినప్పటికీ ఎప్పుడు కూడా ఒకరిపై మరొకరు గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు అదంతా గతం. చైతన్య మరికొద్ది రోజుల్లో శోభితాతో వివాహానికి కూడా సిద్ధమవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో సమంత తన మాజీ భర్త గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి‌. తాను నటించిన వెబ్ సిరీస్ సిటాడేల్ ప్రమోషన్స్‌లో సమంత వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఆమెపై నెగిటివ్ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసింది. ఒక దానిపై భారీగా ఖర్చుపెట్టి, ఆ తర్వాత పూర్తిగా వృధాగా మారినట్టు ఏదైనా భావించారా? అని వరుణ్ అడిగిన ప్రశ్నకు, తన మాజీకి (నాగ చైతన్య) ఇచ్చిన ఖరీదైన బహుమతులంటూ సమంత  సమాధానం ఇచ్చి ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. 
 
ముగిసిపోయిన రిలేషన్‌లో ఇచ్చిపుచ్చకున్న వస్తువులపై ఇప్పుడు సమంత స్పందించటం, ఆమె‌ వరకు అది ప్రాక్టీకల్‌గా సరైనదే అన్పించవచ్చెమో కానీ.. నాగ చైతన్య సరికొత్త వివాహా బంధంలోకి అడుగుపెడుతోన్న తరుణంలో ఆమె ఈ తరహా కామెంట్స్ చేయటం అక్కినేని అభిమానులను బాధిస్తోంది. అయితే బహుమతులు సమంత మాత్రమే ఇవ్వలేదని.. చైతన్య కూడా ఎన్నో ఖరీదైన గిఫ్టులు ఇచ్చారని, ఎదైమైనా ఇన్నాళ్లు వివాహబంధంపై గౌరవంగా వ్యవహరించిన సమంత.. ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు సరికాదని.. ఆమె విచక్షణతో మాట్లాడాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

కదులుతున్న అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments