Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల కోసం ఆగలేను.. త్వరలోనే బుల్లి పాపో బాబో.. సమంత

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (12:04 IST)
పెళ్లి తర్వాత కెరీర్‌లో వేగం పెంచిన అక్కినేని కోడలు సమంత ఈ ఏడాది కూడా తన హవాను కొనసాగిస్తోంది. గతేడాది మంచి బ్లాక్‌బస్టర్‌లను తన ఖాతాలో వేసుకున్న ఈ గోల్డెన్ లెగ్ అమ్మడు ఈ ఏడాది కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. ఇప్పటికే ఆమె నటించిన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక సమంత, చైతు కలిసి నటించిన "మజిలీ" చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. మజిలీ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమంత పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
 
'సూపర్ డీలక్స్' సినిమాలో చాలా బోల్డ్ పాత్రలో నటించాను. ఈ సినిమాలో నా పాత్రపై ప్రేక్షకులు ట్రోల్ చేస్తారని, భయంకరంగా తిడతారని భావించాను, కానీ నా రోల్‌కు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. మొదట్లో ఈ సినిమా కథను నాకు చెప్పినప్పుడు, కథ గురించి, నాకు సంబంధించిన కొన్ని సీన్ల గురించి చైతూకి చెప్పి, తన అభిప్రాయం అడిగాను. నీకు ఇష్టమైతే చెయ్ అని చైతూ సమాధానమిచ్చారు. 
 
మేము ఒకరికొకరి నిర్ణయాలకు అంత విలువనిస్తాము. ఇక మా మామగారు కూడా తన కొడుకులను ప్రోత్సహించినట్లుగానే నన్ను కూడా ప్రోత్సహిస్తారు. ఇక పిల్లలు ఎప్పుడని మీడియా నుండి ప్రశ్న ఎదురవగా ఇంకా ఏదీ ప్లాన్ చేసుకోలేదు, కానీ ఆలోచనలో ఉన్నాం, అలాగని మరో మూడేళ్లు ఆగలేను, త్వరలోనే ఒక బుల్లి పాపనో, బాబునో మా కుటుంబానికి అందిస్తానని సమంత చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

కారు డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసు మళ్లీ విచారణకు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments